పుట:Goopa danpatulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
60

గోపదంపతులు.

గంగమ్మ్మ యొడలికంటియందు దుస్తులధరించుటచే నామెయవయస్ఫూర్తి వెల్లడియయ్యెను. ఆమెచేయు వింతపనికెల్ల మనచెట్టియార్లట్టహాసము గావించుచు, ‘గూడ్ ‘ ఎక్సలెంటు, కాసిటల్, అని కేకలిడుచుండిరి. కడపట గొన్ని క్రూరజంతువినోదములతో నాటముగిసెను.

    అప్పుడు రామయ్యచెట్టిలేచి యాంగ్లభాషలో నాటిప్రదర్శనముం గొనియాడుచు మననాయుకానాయకుల ఖేలనానైపుణ్యమును శ్లాఘించి వారికిరువురకు స్వర్ణపదకములను గానుకలుగా నొసంగెను. ప్రేక్షకులెల్ల జప్పటులుగొట్టి యానందముతో నిండ్లకేగిరి. రామయ్యనటేశముగారులు మాత్రమాగి శంభులింగముపిళ్ళెగారిని బురస్కరించుకొని నేపధ్యాగారములోనికిబోయి కధానాయికానాయకులనుసందర్శించి చెరికొక యుంగరముంగూడబహుమానమిచ్చివారి యత్యద్భుతప్రదర్శనమున కేమిచ్చినను దీఱదని కొనియాడి వారల వీడ్కొని యావలకు వచ్చుచు రామయ్యతనచిరునామాగల ‘కార్డు ‘సామిపిళ్ళచేతికిచ్చి,గంగమ్మవంక సానురాగముగ వీక్షించుచు బయటికివచ్చెను. అంతవారిద్దఱు తమబసల కరిగిరి. సామి యిల్లాలితో నిట్టులనెను.
   అప్ప—-గంగూ! ఇప్పుడువచ్చినవారు చెట్టియార్లు. గొప్పధనవంతులు, కోటెశ్వరులు. వీరుమనప్రదర్శనా కౌశలమునకు మెచ్చియే యిట్లు మనల 

బహుకరించుచుండిరో,