పుట:Goopa danpatulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59

అనురాగాంకూరము.

రంగస్దలమునకువచ్చి చిత్రవిచిత్రాకారము లేర్పడుంటు లొకరిమీదన్ంకొక్రు నిలచియుండిరి. ఆవల,గొందఱుబాలికలు వచ్చి నాల్గుసీసాలమీద నొకబల్ల కాళ్ళునాలుగును నిలిపి యాశ్చర్యకరముగా టనముని జల్పిరి. ఈయాటలన్నియు నెంతనిపుణముగా నాడబడినను మనచెట్టియారు సోదరులకు రుచించ్కుండెను. వారుక్ంక్షించు పదార్దమింకను వరికంట బడకుండుటచే వారు మిగులనాత్రపడుచుండిరి. తరువాత నప్పలసామి వచ్చి మిగులబరువైన యినుపగుండ్లతో జెండ్లాడియునద్భుతవైఖరిని జేతులమీదనుమెడమీదను దలపైని వానిని నడిపించియు గొంతఖేల మొనర్చెను. ఈయాట నించుక శ్రద్ధతో మనచెట్టియారులు చూచిరి. పిమ్మట గొన్ని హస్య ప్రదర్శనములు, జంతుచర్యలు, మున్నగునవి జరిగెను. అంత గంగమ్మయు నప్పలసామియు వింతగా సింగారించుకొని రంగస్దలికివచ్చి నిలిచి సలాములుపెట్టిరి. చెట్టియార్లానందముతో గరతాళ ధ్వనులు గావించిరి. శాలయంతయు సంతోష నినాదములచే సందడించెను. గంగమ్మ నొకసలప్రక్క నిలిపి అమెదేహమునకు దగులకుండ దగ్గఱగా వాడికత్తులను విసరి యప్పలసామి ప్రేక్షకుల మెప్పు దెప్పరముగా బడసెను. తరువాత నతడు విల్లంబులబూని గంగమ్మ దేహభాగములందునుబడిన క్రొవువత్తిదీపములను గుఱిచూచి గొట్టి యార్పెను. ఆవల నాగోపదంపతులు ‘’ట్రెసీజ్ ‘ నాబడు సాధన విశేషముమీద నతాశ్చర్యకరములగు ‘ఫీట్సు ‘ చేసిరి