పుట:Goopa danpatulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

గోపదంపతులు.

యాట లాడనిశ్చయించిరి.వారు మొదట రెండాటలాడిరి. కానియందు వింతలెమియులేవు. నేడు మూడవ ప్రదర్శనము. దీనియందు వారు తమ నూత్నవిద్యాప్రక టనముం జేయసమకట్టిరి.మనచెట్టియా ర్లారెండాటలకుంబోయి చూచిరి. నేడుకూడ జూడదలచి కొనియుంట మున్నెఱిగించి యుంటిమిగదా!

    నాటిప్రాత:కాలమున రామయ్యచెట్టి కాల్యంబులు దీర్చి నిర్ణీతవేళకు నటేశముఛెట్టి భవనమునకు 'కాఫీ ' కి వచ్చెను. ఇడ్డెనలు, దోసెలు, రొట్టెముక్కలు మున్నగుపదార్దములందిని యజ్మిత్రద్వయము కాఫీపానముం గావించెను. ఆవల సువాసనగల తమ్మలము నమలుచు, విలువగల ‘సిగరెట్టు ‘లను వెలిగించి చిత్రవిచిత్రగతుల బొగవిడుచుచు, మెత్తలమర్ప బడియున్న మేల్గురిచీలలోవ్రాలి యిట్లు ప్రసంగింపదొడగిరి.
   రామ—-అన్నా! నీయాజ్ఞననువచ్చితిని. కాఫీపానకృత్యము ముగిసినది. ఇకమనము చేయదగినదేది?
    నటే—నాకార్ ‘ సిద్దముగానున్నది. దానియందు గూరుచుండి యొకచోటికి బోవుదము.
    రామ—-సరే, ఆచోటేదో యడుగవలదని ముందేయాజ్ఞాపించితినిగదా! నాకారుండగా మరలనీకారేల?
   నటే—-నిన్ననేచెప్పితినేని, నీవురాత్రి యందునుగూర్చియే కలలుగందువని యట్లంటిని. కాని మఱియొక రహస్యమే