పుట:Goopa danpatulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56

అనురాగాంకూరము.

మిద్దరమునుగలసి యొకచొటికి బోవలయును. ఎచ్చటికని యిప్పుడునన్నడుగకుము" అనిపలికెను. రామయ్య 'సరే ' యని సోదరునితొ మోటారులో గూర్చుండి తనయింటివంక బోనీయమని బండినడుపు వాని కాజ్ఞలుయిచ్చెను. మనోవేగమున మోటారరిగెను.

7. అనురాగాంకూరము

-(0)-

    మఱుచటిదినమున ట్రాముబండ్లకెల్ల ముందువెనకల స్టార్ సర్కసు వారి ప్రదర్శన ప్రకటనముం దెల్పుపటము లమర్పబడి యుండెను. వాడవాడలయందు వింతవింత వాధ్యద్వనులతో గరపత్రములు పంచిపెట్టబడెను. ఒకట్రాముబండి రంభాస్దంభములతోను జూతపత్త్రమాలికలతొను బుష్ప దామములతొను సింగారింపబడి యున్నసంకల నాటిప్రదర్శనముతో జూపబడు నంశములు వానిపటములు నంటింపబడియుండ బట్టణమంతయు గలయదిరుగుచుండెను. సర్కసు కంపెనీవారీనడుమ మైసూరు బెంగళూరు మున్నగు పట్టణములకేగి, యందు జయప్రదముగా బెక్కుప్రదర్శనములంజల్పి సుమారాఱుమాసములకు మరలివచ్చి, తమ కేంద్రస్దానమగు చెన్నపురియందు గ్రమ్మఱ కొన్నినెలలుండి, తామీనడుమ సేకరించిన క్రొత్తవిద్యలు, బురీయులకు వెల్లడింపగోరి కొన్ని