పుట:Goopa danpatulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

53

దుష్టద్వితయము.

కాలములోనే నీకామెను గూర్తునులెమ్ము నీవు మాత్రము నేనుజెప్పినటులెల్ల జేయుచుండ వలయును.

    రామ- నీవు కూరుచుండుమన్న గూరుచుండును. నిలువుమన్న నిలచును. నీకేమిచేయుమన్నను జేయుదును, మెలపుతో మాత్రము కార్యము సాధించు కొనిరమ్ము.
   నటే--రేపురాత్రి యాటముగిసినతోడనే మనమిరువము నేపద్యాగారములోని కేగుదము ఏంగీ సామిపిళ్ళెను. గంగమ్మారును నభినందించి చెరికొక యంగ్రమును బహుమానమిచ్చివత్తము. వచ్చునప్పుడు నీవు నీచిరునామా చీటిని (అడ్రస్ కార్డు) సామిపిళ్ళె కిచ్చొరమ్ము. రేపటి కిది చాలును. అటుపిమ్మట నేమిచేయవలెనో యావలచింతును.
   రామ--అటులే గావింతును. నాకోర్కెదీర్చు భారము నీది.\
    ఇంతతో రామయ్యచెట్టి  గుమాస్తా యొక డేదో తొందరపనిమీదస్ దన యజమానునితో బ్రసంగింప గోరిరాగా, రామయ్య యించుకతడవు నటేశమును సముద్రపుటొడ్డున 'ఆక్వేరియం  అనబడు మీనశాలకు సమీపస్దలంబున నిలిచియున్న 'మోటారు ' బండికడ దిగవిడిచి తానొక కొంతదవ్వున కేగెను. అప్పుడు నటేశమిట్టు లనుకొనెను. "వీనికిగంగమ్మమీద గట్టివలపు గలిగినది. వీనికిమించిన వలపు నాకును దానియందు గలదని వీడెఱుగడు. కాని మాయుభయులలో నది వీడినె యెన్నుకొనునుగాని, నన్నెనుకొనదని నే