పుట:Goopa danpatulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

గోపదంపతులు

నకు హద్దులేకుండెను. వారు గోపదంపతులు చేయు వింతపనులం దెలుపు పటములు వ్రాయించి ప్రకటన పత్రికలయం దచ్చొత్తించి పట్టణపుగోడల నలంకరించిరి. నూతనసభ్యులతో స్టార్ సర్కస్ మొదటియాట 1915 సం॥ రము జనవరి మొదటి తేదీని హైకోర్టుభవనము లకు వెనుకనున్న మైదానమునందు గ్రొత్తగా నిర్మింపబడిన గుడారమునందు బ్రదర్శింప బడునని పకటింపబడెను. ఆయాటలో గొపదంపతు లేయే వింత యాటలంజూపుదురో విరివిగా దెలుపబడెను. ఆయేట నచ్చట హైందవదేశీయమహాసభ జరుపబడెను. తత్సభ కు బ్రతిరాష్ట్రమునుండియు వేలవేలు మహాజనులు వచ్చి యుండిరి. వారిలో వ్యాయామవిద్యయందు గుతూహలితులెల్ల బై తఱగతుల టిక్కెట్లును రెండు దినములకు ముందేకొనిరి. పట్టణములో నెవరు మాటాడుకొన్నను సర్కసునుగూర్చియే, యందలి ప్రధాన నాయికానాయకుల యాశ్చర్యకరములైన చర్యలను గురించియే, ఆయేట "పార్కుఫే" రనబడు సంతకూద గడుమనోహరలీల నేర్పాటుచేయబడెను. అనంతం జూచుటకేతెంచిన వారిలో బెక్కండ్రాయాటను జూడ నిచ్చించి టిక్కెట్లనుగొనిరి. మొత్తము నిరువది వేల రూపాయల విలువగల టిక్కెట్లు ముందుగా నమ్ముడు పడెను.

   క్రైస్తవసంవత్సరాదినాడు మొదటిప్రదర్శనము కడు జయప్రదముగా జరిగెను. అందు మననాయికా నాయకుల వింత చర్యలకు సంతసింపని వారు లేరు. మనోజ్ఞవేషములం ధరించి