పుట:Goopa danpatulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

గోపదంపతులు.

    గంగమ్మ బొత్తుగా సమాయిక యగుటచేత నామెకా  ప్రయాణములో నెల్లదృశ్యము లానంద దాయకములు గానే యుండెను. స్టేషనువచ్చి బండియాగునప్పుడెల్ల నామెలేది యచ్చట బండ్లమ్మువారి కలతకును యాత్రికులవంక విలసముగా జూచుచు బ్రచారము చేయు యువకులరీతిని నానందమును నాశ్చర్యమును బొందుచుండెను. ప్రతిస్దలమునం దేదోయొక వింత వస్తువు కొనుచుండెను. బండిబండికడకువచ్చి తిరుపమెత్తు బిచ్చగాండ్ర కొక్కొక కాని చొప్పున దానము చేయుచుండెను. 
    వారు రాజమహేంద్రపురము చేరునప్పటికి మధ్యాహ్నకాల మగుటచేత వారి యనుచరుడు వారికి దగిన యాహారము దెప్పించి యిచ్చెను. వారాహరించి యించుక విశ్రమింప బోవుసరికే గోదావరీనదిమీద వంతన వారికి గొచరమయ్యెను. గంగమ్మ సంతొషమున కంతులెకుండెను. ఆమె పూర్వాచారపరాయ;ణ యగుటచేత బసుపు, కుంకుమము, పండ్లు, రవికలగుడ్డ, కొన్నిడబ్బులు, భక్తిపూర్వకముగా గోదావరీదేవి కర్పించి నమస్కరించెను.
     ఇట్లు వారొక్కొక్క స్టేషనుకడనుండి విమలుజూచుచు బ్రొద్దుక్రుంకు సమయమునకు బెజవాడ జేరిరి. వారచ్చట బండిదిగి యించుకసేపు నడయాది యందు గొన్నిపూలును బండ్లును గొని మరల శకట మారోహించిరి. ఆంధ్ర