పుట:Goopa danpatulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35

ప్రయాణము.

   విలిచి అత్యంతగౌరవముతో వారిని బండినెక్కించెను. హితవర్గము  లెల్ల జయజయధ్వానములు చేయుచుండ మన గోపదంపతులు బండిలో నాసీనులైరి. ఆర్మొగముపిళ్ళెగారు వారి యొద్దకువచ్చి చెరికొక పూలమాలయు వైచిరి. అచ్చట గుమిగూడిన స్నెహితులెల్ల గరతాళధ్వనులనులచే దమ యానందముం దెల్పిరి. నాడాయుత్సవముచే బండి నిర్ణీతకాలము దాటి కొన్నినిమిషము లెక్కువగా నిలువ వలసి వచ్చెను. అంత పొగబండికూసెను. ఎల్లరును బండికించుక యెడముగా నిలిచిరి. బండి కదలెను. మరల జయజయద్వానములు చెలరేగెను. కనుచూపు మేర దాటువరకు జనసమూహము ఱొక్కమచ్చుననే గోవులవంక జూచుచుండిరి. ఆవల నెవరియిండ్లకు వారేగిరి.
     వారెక్కినబండి ప్యాసంజ రగుటచేత నన్ని స్టేషనుల కడను నిలుచును. బండి వాల్తేరు వచ్చుసరికి గంగమతల్లి వచ్చి కూరుని నల్లుని గలుసుకొని, వారు దారిలో భుజించుటకు రుచ్యములగు పిండివంటలుఇ కొన్ని కొని తెచ్చియిచ్చి, కూతును కౌగలించుకొని తనకు గడుదూరస్దురాలగుచుండుటచే నించుకసేపు దు:ఖించెను. తల్లిగూతులిరువురు నొకకొంతతడవు కంట దడిపెట్టుకొనిరి. కూతురు తల్లికొక నూఱు రూపాయల నోటునిచ్చి "అమ్మా! నీకెప్పుడేకష్టము తటస్దించినను మాకుదెలియజేయుము." మేము చెన్నపురి చేరినతోడనే మాచిరునామా తెలియజేసెదము" అని చెప్పెను. ఆయిల్లాలు కన్నబిడ్డనువీడి భారముగల్గు మనస్సుతో దనయూడిగములోనికి బోయెను.