పుట:Goopa danpatulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

గోపదంపతులు

హ్వానమందుకొని రకరకముల పిండివంటలు గంగమ్మకు గానుకగా నుకలగా దెచ్చి యామెనాశీర్వదించి బసకేగెను.

    గంగమ్మవలెనే యప్పలసామియు బురుషులనెల్ల నాహ్వానించి యల్పాహార దానములచేతవిందొనరించి, వారుతన్నింతకాలమాదరించి నందులకు దనకృతజ్ఞతనువెలిపుచ్చి యందఱకడ సెలవుగైకొనెను. ఎవరిదో చినకానుకవారతనికిచ్చిరికొందఱుమంచిచేతికఱ్ఱలును,గొందఱుమేలివలువలును మఱికొందఱు ఫలాదులును వానికి దిరుగ బహుమానములు గానిచ్చి గౌరవించి వీడ్కొనిరి.
   ఇట్లు గ్రామస్దులనుండి గౌరవముంబడసి యాగోపాలదంపతులు తమ యిలవేల్పగు సింహాద్రప్పన్నను సేవించుటకు సింహాచలమేగి, స్వామినిసేవించి, మనసార నతనియొద్దగూడ సెలవుబుచ్చుకొని, యింటికి వచ్చి, యొక శుభముహూర్తమున జెన్నపురికి బయనమైరి.
    నాడు గొల్లలందఱును రామభజనలతోను గోలాటములతోను, హరిబల్లాబలతోను గుంపులుగుంపులుగా వచ్చింతమమిత్రుని, వీడ్కోలిపిరి. వీడ్కోలొసంగు మిత్రబృందములతో స్టేషనంతయు గ్రిక్కిరిసిపోయెను. సర్కసుకంపెనీవారి యాంధ్రలేఖకుడు మననాయుకానాయకుల సామానంతయు జాగ్రత్తగా దూనికవేయించి యొకదినమునకుముందే రైలు బండిలోబంపి నాడు వాతిరువురకు రెండవతరగతి టికెట్సు