పుట:Goopa danpatulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

వింతమార్పు.

వనమున కనువగు వాదము లప్పలసామి చేయుచుండెను. తుదకు గంగమ్నవాదమే గెలువ నప్పలసామి స్టార్ సర్కస్ లోజేరుటకు సమ్మతించెను. గంగమ్మ యానందమునము,మేరలేకుండెను.

   మఱునా డఱుణోదయమున గంగమ్మ యెప్పటివాడుక పాలను నొక గొల్లకుఱ్ఱవానిచే బట్టించుకొని స్టేషనుమాస్టరు గారి యింటికివెళ్ళి సుందరమ్మతో నత్యంతసంతోషమున దనమగనిసమ్మతిని దెలియజేసెను. సుందరమ్న పాలను బుచ్చుకొని భద్రపఱచి భర్తతో గంగమ్మచెప్పిన యమ్శములంజెప్పెను. అతడా యుదంతమంతయు దమిళసోదరుల కెఱొగించెను. వారు సంతోఅహాంచితస్వాంతులై తమయానందమును వెల్లడించుటకు నప్పలసామియింటికేగిరి. ప్పలసామి యప్పుడే పొలమునుండి ఇంటికివచ్చియుండెను. తమిళడేశస్దులను జూడగనే యతడు చిఱునవ్వుతో “అయ్యా! నాభార్యప్తోత్సాహముచేత నేను జెన్నపురికేగి మీకంపెనీలో .నుద్యోగముచేయుటకు సమ్మతించితిని. మీరును నేనును మాటాడుకొన్న పద్ధతులన్నియు నొక్యొడంబడికపత్రముపై వ్రైకొనుట మేలుగదా? నేడాపత్రము వ్రాయుపని ముగింతుమేని, రేపటినుండి నేనుబ్రయాణప్రయత్నములొనరించుకొందును. ఒకనెల గడువిస్తిరేని యీలోపున నాదూడలనియు నమ్ముకొని, నేనుసాగుచేయుభూమి యెవరికేని యమర్కముచేసి, నాయితర వ్యవహారములన్నియు సవరించుకొని