పుట:Goopa danpatulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29

వింతమార్పు

క్కసారి గంగమ్మతో మాటలాడగోరుచున్నాను. ఒకసారి యామెను బిలువుము.

   అప్పలసామి లోనికేగి భార్యను వెంటబెట్టుకొని యీవలకువచ్చెను. గంగమ్మను దిలకించి సర్కసువారు తమిళభాషలో దమలోదాము మాటాడుకొనిరి. భర్తవనే భార్యకూడ బలాతిశయము గలదనియు, నెటులో యప్పలసామి నొప్పించి యామెకుగూడ గొన్ని ‘ఫెట్సు ‘ నేర్పించిన, నామెగూడ దమకు జాలనుపయోగమస్రణి కాగలదనియు, గావున నెంతజీతమిచ్చియైన నీజాయాపతులను దమతో గొనిపోవుట కర్తవ్యమనియు, వారుభాషించుకినిరి. అంత నర్మొగముపిళ్ళెగా రిట్టులనిరి.
   అర్మొ—గంగమ్మా! నీభర్తవలన వీరియుదంతము మెఱింగియే యుందువు. వీరు మిమ్ము జెన్నపురికి రాగోరుచున్నారు. మీకందుల కంగీకరింతురేని మీపేళ్ళు భూమిపై శాశ్వతముగా నీలుచునేర్ప్పటు జరుగగలదు.మీరు సుఖముగా ఘనులసమ్ఘములో దిరుగుచు జమీందారులవలె జీవింపవచ్చును. ఈవ్వవసాయకష్టము లుండవు.”కార్వేషు మంత్రి“ యనిభార్యనుగూర్చి పెద్దలుచెప్పెదరు. గావున నీభర్తకు నీవుసదుపదేశమొనర్చి మీసమ్మతిని రేపుమాకు దెలియజేయుము. మీశ్రేయస్సును గోరువారిలొ నేనొక్కడనని యెంచవలయును.