పుట:Goopa danpatulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

గోపదంపతులు.

టాడక వారీయదలచిన స్వల్పమూల్యమునకే యీయ కొనెను.

  అంతవారు సావడిలోనికివచ్చి కూర్చుండి యిట్లు ప్రసంగింపజొచ్చిరి.
    శంభు--మీధారాళమైన మనస్సును జూచి మేము మిక్కిలి సంతోషించుచున్నాము. మీవంటివారు మాపట్టణములో నుండదగినవారు కాని యిట్టిపల్లెలలో నుండదగరు. మీవంటివారు గ్రామములో నుండిపోయిన, మీసహజశక్తులు త్రుప్పువట్టి మీరు సలుపదగిన లోకోపకారము సలుపలేకుందురు.
   అప్ప--అయ్యా! లోకోపకారము చేయబూను వారెక్కడనున్నను జేయవచ్చును. నేను కేవల ముదరి పోషణార్దము వెదకికొనువారిలో నొకడనుగాని 

దేశహితకార్యములొనర్చి ప్రసిద్ధి కెక్కదగిన గొప్పతనము గల్గువాడను గాను.

    శంభు--అయ్యా! మీశక్తిమీఱెరుగరు. ఇందాక మీరావంతెన చేదించునప్పుడును, బిల్లమేకను గొనితెచ్చి గోపబాలుని కిచ్చినప్పుడును, మీయద్భుతశక్తి మాకవగతమైనది. దానింగాంచి నప్పటినుండియు మిమ్ముమాపట్టణమునకు దీసికొని  పోవల;యునని కుతూహల పడుచున్నాము.
    అప్ప-- తమకు నాయందు గల్గిన యవ్యాజప్రేమకు నేను మిగుల గృతజ్ఞడను. గాని నాబోటివా డీపల్లెటూరి