పుట:Goopa danpatulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

వింతమార్పు.

   ఈవింతచర్య యంతయు దిలకించుచు నాదాక్షిణాత్య సోదరులు బాటపై నట్టె నిలిచియుండిరి. అప్పలసామి బాహుబలసంపదకును దేహలాఘవమునకును వారు మిగుల నచ్చెరువొందిరి. అట్టి లాఘవస్పూర్తి గలుగువాడు తమ సర్కసులోనున్న నెంతలెంతలు వింతలైన జేయగల వాడగునని తలంచిరి. అట్టివాని కెంతజీతమిచ్చినను నష్టములేదని యూహించిరి. ఆర్మోగముపిళ్ళె యప్పలసామితో మాటాడి సర్కసులో జేర్చు ప్రయత్నము మొనర్తునని చెప్పెను. 
     ఇట్టులు వారు ప్రసంగించుచుండా నప్పలసామి బాటమీదికివచ్చి స్టేషనుమాష్టరుగారికి వందన మాచరించెను. అంతవారిట్లు సంభాషించుకొనిరి.
    ఆర్మొ-- అప్పలసామీ! వీరు నాసొదరులు,  చెన్నపురినుండి వచ్చియున్నారు. నీవలన నొకింత యుపకారము వారికి గలుగ వలసియున్నది. నీతో మాటాడవలయునని తలచి నీయింటికే మేమెల్లరమును బయలుదేఱి వచ్చుచుండ దారిలో నీవేకాన్పించితివి. ఇంతకుముందు నీవువంతెనను దెగగొట్టుటయు నవల ఆత్రవైఖరిని నీవాలిగట్టునకు బోయి మేకపిల్లనిగొనితెచ్చుటయు మావారుచూచి యాశ్చర్యపడిరి. నీయట్టి శక్తిసంపన్నుడు మద్రాసులో  నుంటయే తటస్దించునేని వేలకువేలు గడింపగల్గువని వారునుడివిరి.వారియభిప్రాయము సరియైనదేయని నేనును నమ్ముచున్నాను.