పుట:Goopa danpatulu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


22

గోపదంపతులు.

కించుచుండెను. వాడొక పావుగంటలోనే యావంతెనను దెగగొట్టెను. తానేటదిగి సుళువుగా మీది వచ్చెదను.

    అప్పుడా యెటికీవలియొడ్డు నందొక గొల్లపిల్లవాడు మేతమేపి  తిరిగివచ్చిన తల్లిమేక నొకచెట్టునకుగట్టి, తాను మధ్యాహ్నమే తల్లిపాలు త్రాగకుండ నాచలిదరి  నొక తరువునకు గట్టియుంచి మేకపిల్లను దీసికొని వచ్చుటకై విసవిస నడుచుచు వంతెనమీద బోవుచుండెను. అప్పలసామి వానిపొకడజూచి యాగిపోయెను. వాడు పరుగుపరుగున బోయినడుమ వంతెన తెగియుండుట గాంచి నెత్తియు నోరును గొట్టుకొనుచు నేడ్వసాగెను. తల్లిపాల్గుడుచు వేళయగుట చేతను దనకెదురుగా వంతెనపైనిల్చియు దన్ను బంధ విముక్తురాలిని జేయజాలక తబ్బిబ్బుపడు తనకాపరిని గుర్తుపట్టిన దగుటచేతను, మేషకిశోరము "మే" యని యర్వజొచ్చెను. బిడ్డకేకవిని యదరిపడి యీవలగట్టున నున్న తల్లిమేక యార్వమొదలిడెను. దానివల్లనుంగాంచి యప్పలసామి జాలిగొని, యా గొల్లపిల్లవానికి దోడ్పడ నిశ్చయించుకొని తెగగొట్టబడిన వంతెనమీదికి బోయి, యందలి చివరి కొయ్య రెండుచేతుల బట్టి వ్రేలాడుచు  నొక్కయూపు రెండవవైపు విఱిగియున్న కొయ్యకొననందుకొని, యవలీల నావలిగట్టుం జేరి, పిల్లమేక కట్టువదలించి, దానిని మూపునదాల్చి మరల నాప్రక్రియనే  యీవలి వడ్డునకువచ్చి, గోపార్భకుని భీతి బోగొట్టెను.