పుట:Goopa danpatulu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


21

వింతమార్పు.

నకు నప్పలసామియింటికిని సుమారొకమైలు దూరమున్నది. ఈనడుమనుండుబాట నిర్మలమై యిర్వంకల భూరివృక్షలతో శోభించునదై, మనోజ్ఞముగా నుండును. ఒకప్రక్క గొన్ని కొండలునుగలవు, వారాప్రకృతిసౌందర్యముందిలకించుచు నెమ్మదిరా నడిచిపోవుచుండ బాట కెడమప్రక్కనున్న కొండలోయకు బోవలెయునన్న నొకవంతెనమీదినుండి పోవలయును. ఆ కాలువ కీవలనుండు పొలము మన యప్పలసామిది. రాత్రులయందొక చిందుగుపులి కొండ మీదినుండి యావంతేనమీదుగా నప్పలసామిక్షేత్రములో జొచ్చి యందున్న దుక్కి పసువుల నప్పుడప్పు డెత్తుకొనిపోవుచున్నది. ఆవంతెన యాతాయాతజనుల కుపయోగకరముగా నున్నను మనకధానాయకునకు  నష్టదాయకముగా నుండెను. ఆయేటినిండ నీరున్నప్పుడు పెద్దవాండ్రు సైతము సులభముగా దానిని దరింపజాలరు. ఆచిందుగు నుపద్రవము దప్పించుటకై యప్పలసామి యావంతెనను దెగగొట్ట నిశ్చయించి తానొక్కడే యొక గొడ్డలి చేబూని దానిని చేదించుచుండెను. ఆ సమయముననే సర్కసుకంపెనీవారితో స్టేషనుమాస్ట రాదారిన బోవుట తటస్దించినది. అతడు దూరమునుండి యప్పలసామి నానవాలుపట్టి యతడు వచ్చువఱకు నాగుదమని బంధువులతో జెప్పి యాపి వాడుచేయు సాహసకృత్యమును దిల