పుట:Goopa danpatulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. వింతమార్పు

    చెన్నపట్టణములో నూతనముగా నొక సర్కసు కంపెనీ స్దాపింపబడినది. దానికి 'స్టార్ సర్కస్ ' అని పేరిడిరి. దాని యాధిపత్యము వహించు భాగస్వాము లిరువురు. రామస్వామి మొదలియారు శంభులింగము పిళ్ళెగారు లనువారు గలరు. వారు తమకపెనీ వృద్ధిచేయుటకు బలువింతల బ్రయత్నములు సేయు చుండిరి. శరీరమును స్వాధీనముజేసికొని తదవ యనముల ననేకభంగులు ద్రిప్పగల దిట్టలుకొందఱు, యోగాభ్యాసముజేసి యూపిరితిత్తుల నిచ్చవచ్చిన రీతిగా బెంచి యెంతటిబరువైన ఱొమ్ముపై  మోయుచు నత్యాశ్చర్యకరములగు పనులుచేయువారు కొందఱు. ఏకచక్ర ద్విచక్ర శకటాదులపై జిత్రవిచిత్రగతుల సంచారము చేయగల్గు వారు కొందఱు, గుఱ్ఱములను, నేంగులను లోబఱుచుకొని పలురకములనడలను నడిపించ్వారు కొందఱు. హ్రస్వదీర్గాకారములు గలుగు  గిత్తలమొత్తలములచే నెన్నియో వినోదములు చేయింప గల్గువారు కొందఱు, ఇట్టులెందఱేని నేర్పరులు తత్సంఘమున గలరు.
     వారు చూపువినోదములలో బొట్టిగిత్తలచే రేకలా బండ్లను బల్తెఱంగుల లాగించుటొకటి. అందునిమిత్తము కొన్ని బలిష్ఠములగు పొట్టికోడె దూడలు వారుసంపాదింపబూని