పుట:Goopa danpatulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

గోపదంపతులు

దిగవిడిచెను. రొక్కమేమియు లేదు. హఠాన్మరణముగుట చేత నప్పలసామి మఱుచటిదినమునుండియే తిండికి దడువుకొనవలసి వచ్చెను. పోలీసుసూపరింటెండెంటు అప్పలసామిపై ననుకంపబూని యతనితండ్రి యింతకుబూర్వ మొనర్చిన సేవకై యొక వేయిరూపాయలు దొరతనమువారిచే నప్పలసామికిప్పించెను. ఆమొత్తము పెట్టుబడిగా జేసికొని యప్పలసామి యేదేని వ్యాపారము చేయవలెనని నిశ్చయించుకొనెను. కానియన్నిటికన్నమున్ను తన పెండ్లిమాట తెమల్చుకొనవలెనని తలచి యతడు మరల గంగమ్మతొ రహస్యముగా మాటాడెను. తనవలపును దల్లితొజెప్పిన నికలాభములేదనియూ హించి, తనకు ధనముతో బనిలేదనియు, బ్రేమయే ప్రధానమనియు నాలోచించి, యెటులైన నప్పలసామినే వివాహమాడుట యుక్తమని నిశ్చయించుకొని, యతడు రమ్మనినచోటికివచ్చి యతనింబెండ్లియాడి యతనితో గాపురముచేయవలె నని కృతనిశ్చయురాలైయ్యెను., ఆమెయు నప్పలసామియు సింహాచలమునకుబోయి, యచ్చటి కొండమీద శ్రీనృసింహస్వామియెదుట వివాహవిధి జరపుకొని, యటుపిమ్మట గోపాలపట్టణములో నివచించుచు వ్యవసాయవృత్తినే జీవింపల;యునని యేర్పాటుచేసికొనిరి.

     ఒకనాడప్పలసామి గోపాలపట్టణమునకుబోయి యచ్చట సాటిగొల్లలయిండ్లలో నొకటి యెద్దెకుదీసికొని యాయూరి కరణముగారి భూమియొకటి సాగుచేయుటకును నేడా