పుట:Goopa danpatulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

స్వప్నములు.

ణములతోను, మందహాసవిలాసప్రకటనములతోను నొండొరువుల బరామర్శించుకొనుచుండిరి. గంగమ్మతండ్రిరామస్వామినాయుడుకూడ దనతండ్రి వెంకటేశ్వరులునాయుడువలెనే నాయుడని పిలువబడుచుండుటచే దామొక్కజాతివారమే కావచ్చునని యప్పలస్వామి యూహించి యొకనాడుగంగమ్మతలవిరియ నారబోసికొని యొక్కతెయేవీధి యరుగుమీదబ్రచారముచేయుచుండజూచి “అమ్మాయి!మీకులమేది?” యనియడిగెను. ఆమె ముసిముసినవ్వులునవ్వుచు “మేము గొల్లలమి. మీదియేకుల”మని తిరుగుబ్రశ్నించెను.అతడు”మనముభయులము నొక్క కులమువారమే“యనిమార్పలికి, యామెవంకసానురాగముగా జూచుచేగెను. ఇట్లుప్రేమైకవీక్షణములతో గొన్నాళ్ళుగడప నొకనాడునీతోగొంతప్రసంగింపదలచు కొంటిని. ఎప్పుడవకాశము చిక్కునో తెల్పెదవా?” యని యతడుగంగమ్మయురుగ నున్నప్పుడడిగెను. నాతో నీవుప్రసంగింపద్గింసదేమి యుండునని పలుకక, యాతనియభిప్రాయము తానుగ్ర్హించి యందుంకు లోనానందించు చున్నదేగావున, గంగమ్మ “రేపుమాయమ్మదివాణములోనికి వెళ్ళినతర్వాతనేనొక్కర్తునే యింటనుందును. మీరెండవేళ భోజనమయినతర్వాత మాఇంటికిరావచ్చు“ న్నివచించెను. అప్పలస్వామిమోదమంది యింటికేగి మఱునాడు నంకేత సమయముంకుగ్ంగమ్మైంటికివెళ్ళి తనకామెయందుగల ప్రేమను వెల్లడించి యామెసమ్మతించునేని తానామెనుబెండ్లియాడి యావజ్జీవ