పుట:Goopa danpatulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
162

గోపదంపతులు.

మరల దీనితొ గాపురమున కియ్యగొంటిని. ఇది యొనర్చిన పాపము రూపముదాల్చినాయెట్టయెదుట గన్పట్టుచుండ ' నేనింక నెట్లువహింప గలుగుదును? ఓ దైవమా! నాకేదారి కల్పింతువు? నేనుదీనిని ఇసర్జింప జూచినను, నాపరితాప మడంగదు. ఇదియు దీనిబిడ్డయు నాకంట బడునప్పుడెల్ల నాయవమానాగ్ని రగిలి నన్ను దినదినము దహించి వేయుచుండును గదా! ఆయగ్నిచే దహింపబడి దినక్రమమున నేనాడో చచ్చుటాకన్న, నేడే యేయుపాయముచేతనో ప్రాణములు గోలుపోవుట యుత్తమమార్గమగునుగదా? ఓయీశ్వరా! నన్నీ భూలోకరంగమున నవతరింపజేసి నాచే నాడింపదగని నాటకమాడించితివి. నీవు నెపధ్యమున నిల్చి నన్ను నీకడకురమ్మని పిలెచెడు ఘంటానాదము నీవుచేయుచున్నట్లు నాకు గోచరించు చున్నది. ఇక నీపాత్ర నిష్క్రమింపవలసినదే. ఇదేవచ్చు చున్నాను. ఉన్నపాటుననే వచ్చుచున్నాను. నేను సవరించుకొనవలసి నదేమియు లేదు. అయిన నొక్కసారి నాబార్యతొ మాటాడి మఱివచ్చు చున్నాను." అని తనలో దాను బల్కికొని, జోలపాటల బాడుచు దనబిడ్దను జోకొట్టుచున్న బార్యనుంబిలిచి యిట్లుప్రసంగించెను.

    అప్ప--గంగూ! (అని పిలుచునప్పటికి గంగమ్మ  యులికిపడి బిడ్డనచ్చటనే దిగవిడిచి యావలకు వచ్చెను.) నిన్నొక్కప్రశ్నముమాత్రమే యడిగెదను. దానికిసరియైన జవాబు,