పుట:Goopa danpatulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

161

ఆశ్లేషము.

నదనుట కెట్టిసందియమును లెదుగదా! రామయ్యచెట్టి బిడ్దను నేనొకతఱి గాపాడితిని చెప్పినప్పుడిగియు దక్కుంగల తమిళస్త్రీలును నెవ్వెఱపడిరి. ఆనివ్వెరపాటున కర్దమిప్పుడు గోచరించుచున్నది. ఈబిడ్దయే రామయ్యచెట్టి బిడ్దకావలయును! ఇది నేను సందేహించినట్టుగా రామయ్యచెట్టితో లేచిపోయి యుంట నిజమే, ఆహా! వాడెంతమోసగాడు! 'అమ్మతొడు. నేనెట్టి పాపకార్యమును జేసియెఱుగ ' నని కల్లబొల్లిమాటలాడి నాకు నమ్మకము బుట్టించినాడు. తమిళదేశపు మోసమంతయు వానికడనే యున్నదిగదా! నాతో మాటాడునపుడు స్నేహరస మొలికించుచు వికట మందహాసస మొనర్చుచు మాటాడినాడు. వాని వాలకముంగాంచి, వాడు విశ్వాసార్హుడనుకొంటిని . నాకంపదీసినాడు. పయోముఖవిషకుంభము, గోముఖ వ్యాఘ్రము! ఇదియాయూరనే నన్నుగికురించి పరపురుషునితో వేశ్యవలెగాపురము జేయుచు మూడేండ్లుండుట నేను గ్రహింపలేకపోయితినే! నావంటి మందుండునా? నేను బెండ్లాడినకాంత పరపురుషుని జెపట్టి వానివలన గన్నకూతునకు వర్దంత్యుత్సవముం జేయుచుందుగా, నెట్టి యనుమానమును లేక నేనా యుత్సవమునందు బాల్గొని విందుగుడువ నేగితినిగదా! నాకన్నగొప్పయవివేకి లొకములో నుండునా? (ఒకనిట్టూర్పుపుచ్చి) ఇప్పుడేమి చేయవలయును? ఇది భ్రష్టయని మున్నెఱిగి యున్నను, దీనిమరితర హాస్య మామూలముగా నెఱుగకపోవుటచే నేనూరట గాంచి