పుట:Goopa danpatulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
160

గోపదంపతులు.

మున లోనికరిగెను. అప్పలసామియు నామె వెనువెంటనే వచ్చి యాగుమ్మముకడ నాగెను.

      గంగమ్మ లోనికేగుటయు,నందు వసారాగదిలొ దూగుటుయ్యాలలో బండుకొని నిద్రించుచున్న బిడ్దను "అమ్మా! శకుంతలా! లే, తల్లీ!" యనిపిలిచి లేపుటయు, పిలిచినంతనే యులికిపడి యాబిడ్డలేచి గంగమ్మను కౌగిలించుకొని, "అమ్మా! ఇప్పులావచ్చావు?  నెనుబువ్వతిన్నేలేదు" అని చెప్పుటయు "అయ్యో! వెఱ్ఱితల్లీ! నారాక కొంచమాలస్య మైనంతమాత్రమున నీవు బువ్వతినవలదా? అత్తయ్య గారు తినుపించలేదా?"  యని యామె బిడ్డనడుగుటయు, లెదని బిడ్దమార్చలికి యేడ్చుటయు, నామె బిడ్దనెత్తుకొని దగ్గఱనున్న యొక చిన్న 'బీరువా ' కడకేగి యందున్న పెట్టెలోని 'బిస్కట్సు ' కొన్నిదీసి పెట్టుటయు, గడపట బిడ్డనడ్డాలలో వైచుకొని పాల్గుడిపి నిద్రబుచ్చుటయు, నప్పలసామిగాంచెను. అతని ఆశ్చర్యము, భయము, శోకము, క్రోధము, మఱియు నేవేవో జనించెను. కాని గభీరహృదయు డగుటచే వేనీ బైకి రానీయలేదు. "ఆహా! ఈచర్య గప్పి పుచుటకే కాబోలు నిది 'యెందుంటినని నన్నడగకుడు. భ్రష్టురాల నైతిననుట సత్యమని, నాతో నలనాడు వచించిందె! ఇది యెంత జగవెంత? ఎంతమొసకత్తె! ఆనడుమ నొక ముదుసలి దానితొ సుందరమ్మ వచ్చినప్పుడీ బిడ్డనే యిదియెత్తుకొని యున్నది. దీనివైఖరింజూడ నీశిశువు దీని కుపభర్త వలన గల్గి