పుట:Goopa danpatulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
158

గోపదంపతులు.

మ్మయు దనగుట్టు వెల్లడికాలేదనియే నమ్మి యూరట వహించి యుండెను.

    రాత్రి యెప్పటివలె మగడును దానును భుజించి మగడు కొంతతడవు పుస్తకమొకటి చదువుకొను చున్నట్లు కనబడ దాను జాలసేపు పసువులమేతలు పాడిసవరణలు మున్నగుపనులయందు  నిమగ్నమై యున్నట్లు నటించెను. నేడు తనచర్య నటనమని యాతడు గ్రహింపగల్గెను. కాని యాతనిచర్యము నటనమేయని గంగమ్మ గ్రహింపలేక పోయెను. అప్పలసామి పదిగంటలరాత్రివఱ కటులేచదువు చున్నట్టులుండెను. గంగమ్మ యింకను బనిచేయుచున్నట్టులున్న నతడనుమానించు నని తలంచి పనులెల్ల ముగించుకొని, శయనమందిరము నకు బోయెను. అప్పలసామియు బడకజేరెను. అప్పటికి గంగమ్మమేనువాల్చి నిదురనటించుచుండెను. అప్పలసామి యామెను మాటాడింపక తానును మేను వాల్చెను. గంగమ్మ కన్నులుమూసి దీర్ఘనిశ్వాసములతొ నిద్దురబోవుచున్న దాని భూమికంగొని జయప్రదముగా నటించెను. అప్పలసామియు గన్నులు మూసికొని కొంతసేపు చిన్నిచిన్ని యూర్పులును, గొంతతడవు పెద్దపదయూర్పులును నవల గుఱ్ఱుతో గూడిన యూర్పులుంజు బుచ్చి తనపాత్రముంగూడ లెస్సగా బొషింపగల్గెను. మగడు గాఢనిద్రయే చెందుచుండెనని గంగమ్మ నిశ్చయించి చప్పుడు చేయకుండ మెల్లగలేచి పిల్లివలె నడుగులిడుచు, వాకిటికివచ్చి మరల నింకొకసారి భర్తవంక