పుట:Goopa danpatulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
156

గొపదంపతులు.

    అప్ప--అయ్యా! నాక్షేమము కేకొఱతయులేదు. ఏదోపనియున్నగాని తమరు మాయింటికిరారు.
    రాజు--పనేమియులేదు.నిన్నరాత్రి రెండుజాములకు నేను బాలికాపుతో బొలమునుండి యింటికేతెంచుచుంటిని అప్పుడు నీభార్య యేదోతొందర పనిమీద గాబోలుస్టేషన్ మాష్టరుగారి యింటికేగు చున్నది. మాపాలికాపొకడామెను బలుకరించెను. కాని నేను మాటాడలేదు. తాను మాష్టరుగారియింటికే పొవుచున్నట్టు లామె వచించెను, అంత యర్దరాత్రమున నొంటియై నీమె యేలపోవలయునని శంకించితిని. అప్పుడు రైలుబండ్లు వచ్చువేళయుగాదు. నీకేదోజబ్బుచేసినదేమోనని యనుమానించితిని. ఇరుమునకైనద్రుప్పుపట్టుంగాని, నీకుభయములేదని మరల నూహించితిని. కాని సందేహము దీర్చుకొనుటయే మేలనియిటువచ్చితిని. నీవారొగ్య వంతుడవై యున్నందులకు సంతొషముగానున్నది. విశేషములెవ్వియులేవుగదా?
    అప్ప--నిన్నరాత్రముననా! నాభార్యమీకు గన్పట్టినదా! మీరు మఱియొకతెనుజూచి యామెనుగా దలపలేదు గద/
    రాజు--మీకాసందేహమక్కఱలేదు. మాపాలికాపు నీబార్య యారీతిని నిశీధమున మాష్టరుగారి యింటికేగుచుండ బలుసారులు చూచి నాడట. ఆయాప్రక్కనుండియే