పుట:Goopa danpatulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

155

ఆశ్లేషము.

చుండుననికాని, సుఖముగా నిద్రించుచుండుననికాని, తలపదు. అత్యాదర:పాపశంకి "యనిపెద్దలు చెప్పుట కామెయే ప్రబల నిదర్శనము.

     వేఱొకనా డెప్పటియట్లమగనినిద్రబుచ్చి గంగమ్మ సుందరమ్మయింటికి జనుచుండెను. దారిలో వెనుకటి పాలికాపులును, వారికామందగు నొకక్షత్రియుడును నామె కంట బడిరి. ఆమె చెట్టుచాటునకుబోయి  దాగికొనజూచెను. కాని వారు లెస్సగా దన్నుగుర్తించిరని  యెఱుగుటచే నది మఱింత యనుమానహేతువని యూహించి యెదుటబడియెను. "అమ్మగారు మరల వెళ్లుచున్నారెక్కడికో" యని యొకపాలికాపనెను. ఆమె కలవతపడుచు 'స్టేషన్ మస్టరుగారి యింటికే" యని జవాబిచ్చి వెనుక వెనుక చూచుచుబోయెను. తామిదివఱ కామెనుజూచి యొకపర్యాయము మాటాడుటయు, రెండుమూడుసారు లామె నిశీధమున నారీతి మాష్టరుగారి బసకేగుచుండ దూరమునుండి చూచి గుర్తించుటయు బాలికాపులు తమయజమానితో జెప్పిరి.ఆయజమానుడును నామె చర్య యనుమానాస్పదమే యని వచించెను.
      మరునాడాక్షత్రియుడు పనిగల్పించుకొని8 యప్పలసామియింటికి వచ్చి "అప్పలసామీ! నీకు క్షేమమేకద!" యని యడిగెను.