పుట:Goopa danpatulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

స్వప్నములు

జేయుటనేర్చుకొనెను. ఫుట్బాల్, టెన్నిస్, క్రికెత్ మున్నగు ఖేలనములలో దిట్టయనిపించుకొనెను. అతడొక్కడే కొడుకగుటచే దండ్రివానునేమియు ననెడువాడుకాడు. విశేషించి వాని వ్యాయామమున కనువగు సాత్త్వికాహారముగూడ వానికి సమకూర్చుచుండువాడు.

    పట్టణమును దర్శించుటకు గవర్నరులుగాని మఱియే గొప్పయుద్యోగులుగాని వచ్చినప్పుడు, అప్పలస్వామినిరావించి యతనిచే గొన్ని బలవినోదప్రదర్శనములు జరిపించి యానందించుట యాయూరివారి యాచారమయ్యెను. ఇట్టు లప్లలస్వామి కీర్తివ్యాపించెను. అతడెన్నియో బహుమాన పదకములను బడసెను. వాని కిరువదేండ్ల వయస్సున్నప్పుడు వానితల్లి మశూచికవ్యాధిచే మృతినొందెను. వానితండ్రి మరల నుద్వాహమాడనిచ్చింపక కుమారునితోనెటులో కాలము బుచ్చుచుండెను. ఇంట వండిపెట్టువారెవ్వరులేమి నొకదూరంపుజుట్టమైన ముసలమ్మను దెచ్చుకొని యామె యింతతిండి పెట్టుచుండ దనయుద్యోగధర్మమును యధావిధినెఱవేర్చుచు వెంకటేశ్వరులు కాలక్షేపము చేయుచుండెను. ఆయుద్యోగములో చిల్లిగవ్వయైన లంచముపుచ్చుకొనకుండుస్వభావముగలవాడగుటచే, నతడుసుతునికి ధనమేమియు నిలువజేసి యీయజాలకుండెను. వానిసంపాదనమంతయు సుఖజీవనమునకే వ్యమగుచుండెను.