పుట:Goopa danpatulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

147

ఆశ్లేషము.

కొక్క కడియముజతయు, మెడలో నొకటిరెండు పేరులును జెవులకు దుద్దులును ధరించి తక్కుంగల నగలెల్ల నమ్మించి గంగమ్మ సొమ్ముగా మార్పించెను. మరల రెండుగేదెలను రెండావులను గొని వాని పాల్పెరుగులమ్మించుటకారంభించెను. కాని, భర్తయజ్ఞచే నామెస్వయముగా నింటింటికేగి పాలమ్ముపద్దతి మానుకొనెను. వీరిద్దరునౌకరుల నింటనుంచుకొని యాపనులెల్ల నామె జాగ్రత్తగా నెఱవేర్చుచుండెను. అప్పలసామి నిప్పుడెల్లరు నాయుడుగారని పిలుచుచుండిరి. అతడు వెనుకటికన్న నిప్పుడెక్కువ గౌరవముతో జూచుచుండిరి.

   ఇట్లు రెండుమాసములుఇ గతించెను. కరణముగారు సాగిచేయుచున్న తనమాసపు నప్పలసామి పుచ్చుకొని మరల వ్యవసాయమునకు దిగెను. మున్నావృత్తియే యతనికి సుఖప్రదమైయుండుటచే, నతడుదానికే పూనుకొనెను. తాను వ్యవసాయవృత్తియు, గంగమ్మ పాలమ్మువ్యాపారమును జేయుచుండిరి. భర్తయానతిపై గంగమ్మ యార్మొగంకుపిళ్లగారి యింతికిబోవుట పూర్తిగామానినది. ఆమెనొక్కసారి తనయింటికి రాగోరుచు సుందరమ్మ నాలుగైదుమాఱులు తనదాసీజనముచే దెలియజేసినను, నామె యేదో నెపమిడి పొవకుండెను. సుందరమ్మ యొకటిరెండు పర్యాయము లామెబసకు వచ్చినప్పుడుసైతము కొంచెముగా మాటాడెను. కాని మునుపటివలె జనవున భాషింపకుండెను. తానొచ్చిన తప్ప