పుట:Goopa danpatulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

143

నరలుబాటు.

      "బ్రాణేశ్వరా! మీయాజ్ఞకు జవదాటుదునేని, నాశిరఖండనము సేయుడు, ఇదివఱకు మీకొనర్చిన యపరాధమేకాక యింకను జేయుదునా?" యని యామె మాఱుపల్కెను. ఇరువురును లేచిరి. అప్పలసామి భార్యను దనబసకు రమ్మని గొరెను. కాని గంగమ్మ తనస్నేహితురాలగు లక్ష్మమ్మ తనకొఱ కెదురుచూచుచుండుననియు దానారాత్రికి భర్తబసకు రాజాలననియు బల్కి యతడు తనకు దగ్గఱగనే 'అక్బర్  సాహెబు ' వీధిలొ నుంట తెలిసికొని, యతనికడ, సెలవుబుచ్చుకొని పోయెను.
        ఆరాత్రి యామె సుబ్బులక్ష్మమ్మగారి యింటనే యుండి తెల్లవాఱుజామున లేచి, నిదురించుచున్న బిడ్డను బల్మారు ముద్దిడుకొని, యాపజాలని కన్నీటి ప్రవాహముం బ్రవహింపజేయుచు గొంతసేపేడ్చి, యవల గుండెకుదురుపరుచుకొని భర్తకడకు బోయెను. బిడ్డలేచి "అమ్మమ్మా! మాయమ్మయేది?" యనియడుగ, సుబ్బులక్ష్మమ్మ యేవోమాటలుచెప్పి దానినొప్పించి తనమనుమలతో నాడించుచు గాలక్షేపము జేయుచుండెను. నాటిసాయంకాలమే గంగమ్మయు నప్పలసామియు జెన్నపురి వీది గోపాలపట్టణముకై ప్రయాణమైరి. అప్పలసామి తాను బ్యాంకిలో దాచుకొన్న సొమ్ము గైకొని తనసామగ్రియంతయు గూర్చుకొని మిత్రులకడ సెలవు బుచ్చుకొనెను.