పుట:Goopa danpatulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
140

గోపదంపతులు.

నాయొద్దకి రావించుకొందునులెండు. నేనిప్పు డెక్కడికి బోయెదనో చెప్పజాలను. ఎక్కడనున్నను నాయునికిని గూర్చి మీకెఱింగింతును. నా కీయుపకారముమాత్ర మొనరింపుడు." అని గంగమ్మ సుబ్బులక్ష్మమ్మ పాదములపై బడెను.

   సుబ్బు--అమ్మా! నీబిడ్డను సాకుట కేయభ్యంతర మును మాకులేదు. కాని యిది బెంగబెట్టుకొనిన జాల కష్టపడవలసివచ్చును. దీనికేమంతవ్యల్యమగును? నీవిచ్చు కాసులపేరు దీనిమెడలోనే యుంతునులెమ్ము. (అని కాసులపేరు శిశువు మెడలో వైచెను.) తప్పనిసరివచ్చిన దానిని విక్రయించివలయు ఖర్చు లొనర్తును.
   గంగ--(బిడ్డను సుబ్బులక్ష్మమ్మ చేతికందిచ్చి గోలు గోలున నేడ్చును.) అమ్మా! ఇది మీబిడ్డయనియే యెంచుడు కనుటయే నావంతైనది. ఇక దీనిముద్దు ముచ్చటల జూచు నదృష్టము నాకు లేదు. (కూరువంక దిరిగి) తల్లీ! ఇక నీకును నాకును ఋణము చెల్లినది. నిన్ను నాకు బ్రసాదించిన యాదయామయుడగు భగవంతుడు నీకు దీర్ఘాయు రారోగ్యములిచ్చి సమస్తైశ్వర్యములను సమకూర్చుగాత. నీ కీ సుబ్బులక్ష్మమ్మగారే తల్లిదండ్రులు. (అని మరల నొక్కసారి దగ్గఱకుదీసికొని పలుమాఱు ముద్దుపెట్టుకొని కన్నీరు కాల్వలై పాఱుచుండగా దానిని గ్రమ్మఱ సుబ్బులక్ష్మమ్మ కరములందుంచెను.)