పుట:Goopa danpatulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

139

మరలుబాటు.

వలెనే నీవు నేర్పుమాటలాడుచు నీయస్దిపంజరములో బంధింపబడుట కియ్యకొనుమందువా? ఇక నధిక ప్రసంగము మాని పొమ్ము.

   అనుచు గంగాబాయి లేచి చివచివ లోనికేగి యుయ్యెలలో నిద్రించుచున్న చిన్నబిడ్డనెత్తుకొని కట్టుగుడ్డతోనే వీధిలోనికి బోయెను. ఆమెతీరుజూచి చేటిక లాశ్చర్యపడి వెంటరాగా గంగమ్మ "అమ్మలారా! నాకిక నిచ్వటనుండు బనిలేదు. చెట్టిగారు వేరొకకాంతను జేపట్టి నాకు స్వస్తి జెప్పించినారు. మీరిక నాసేవకురాండ్రుగారు. నేనేనేని యపరధము లొనర్చియున్న, నన్ను క్షమింపుడు. నావెంటరాక వెనుకకు మరలుడు" అని వారిని వారించెను. దారివెంబడి నొక 'జట్కా ' పోవుచుండ దాని నద్దకుం గట్టించుకొని చెన్నపురిలోని తిరువనక్కేణికిబోయి యందు వీరరాఘవమొదలియారు వీదిలోనున్న సుబ్బులక్ష్మమ్మకడకేగెను. ఏగి తనకు తటస్దించిన యవమానమెల్ల దెల్లముగ జెప్పెను. సుబ్బలక్ష్మమ్మ గంగమ్మ దురవస్దకు మిగులవగచి "కింకర్తవ్యమెమి?" యని యెడిగెను. "అమ్మా! నాయందు గృపవహించి నాయీచిన్నికందును మీయొద్దనుంచుకొని మీమనుమలతోబాటంత యన్నముంబెట్టి పెంపగోరెదను. మీరు మాఱుమాటాడక నేనిచ్చు నీభూషణము గైకొని దీనికగు వ్యయముం జేయుడు. (అనుచ్వు దన మెడనున్నకట్టుకాసులపేరు తీరి యామెకిచ్చెను.) ఇది నాకొఱకు బెమగొనునేని