పుట:Goopa danpatulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
132

గోపదంపతులు.

నీవు నా పూనమల్లి బంగాళాలో నుందువు. ఆమె పల్లవరములోనుండును.

    జాన--అయ్యా! పాపమామెప్రేమను నేను బంచుకొని మీతో సుఖమనుభవించుట న్యాయముగాదు. ఆమె యొక యిల్లాలయ్యు నెంతగా మిమ్మువలచుటచే మీయెద్దికివచ్చియున్నదో! అట్టియామె కుత్సాహభంగము గల్గించుట నాకు దగదు. వలదు. నాతోడిపొందు మీరు కోరవలదు.
     రామ--మనోహరిణీ! నీవిన్ని మాటలాడవలదు. ఆమెను బూర్తిగా నిరాకరింపుచుందునేని, నేడే కొంతభరణమామె కేర్పాటుచేసి యామెను బంపివైతును. 
    జాన--సరియే, ఆమెపైగా దెచ్చికొనబడినది. గావున, మీరు కొంకక భరణమిచ్చి పంపివైతురు. మీ పెండ్లి పెండ్లాముమాట యేమందురు?ఆమె మంచిది గావున మీయాటలు సాగుచున్నవి. ఆమెవచ్చి మిమ్మునల్వుఱిలో బెట్టిన నేమిసేయుదురు?
    రామ--ఆమెకుగూడ గొరినభరణమిచ్చి వదల్చుకొందును. నీవు రూపముచేతను, గంఠధ్వని చేతను, నచ్చముగ నాపెండ్లిపెండ్లామువలేనే యుంటివి. నేనిక భావముచేతగూడ నా పెండ్లి పెండ్లామవై పొమ్ము.
    నటే--సుందరీ! అన్నివిధముల నతడు నిన్ను గోరునప్పుడు నీవు మాఱుమాటడక సమ్మతింపుము.
    జాన--సమ్మతింతును. కాని ముందుగా సర్కసుకాం