పుట:Goopa danpatulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

131

పునస్సమాగమము.

     జాన--(నునుసిగ్గు నటించుచు) అయ్యా! కాముకుల వలపుం నేనెఱుగుదును. తొలుత వలపు లొలికింతురు., ఆవల గికురించి మఱియెక కాంత చెంతకు బోవుదురు. తుమ్మెద నోపుష్పమును విటకాండ్రకొక వెలదియునిర్ణయముండునా? 
   రామ--మోహనాంగీ! నేనట్టివాడనుగాను., నేపనితను జేపట్టినను దగినంతకారణమున్నగాని విడువను. 
    జాన--కారణములకేమిగొదువ? మీమనస్సు బాఱినప్పుడెన్నియోకారణములు కన్పట్టకకపొవు. 
    రామ--ఇంతీ! నామాట నమ్ముము. నీవేకారణము చేతనో నేను మొదట బెండ్లియాడిన కాంతవలె నుంటివి. ఆమెను దైవసాక్షిగా బరిణయమైనట్టులే నిన్నును వరించితినని నమ్మి నాచేట్టబట్ట నంగీకరింపుము. నీవేమికోరిన నది యిచ్చెదను.
   జాన--దైవసాక్ష్యము లీకాలమున వ్రర్దములే. ఆమెనుఇ ద్రొసిపుచ్చినటులే నన్నును గావింతురేమో! ఎవ్వరెఱుగుదురు?
 రామ--నీవెట్టి బాసలు చేయమన్నను జేసెదను. నీకు నాయాస్తియంతయు వ్రాసియిమ్మన్న నిత్తును. 
    జాన--మీరు ప్రకృతమున దొరకాంతను, సర్కసులో సాములుచేయుదానిని, జేరదీసికొని ముంచేరట కాదా? ఆమెతో నాకెట్లు సరిపడును?
    రామ--ఆమెకును నీకును సంబంధమే యుండదు.