పుట:Goopa danpatulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
130

గోపదంపతులు.

గట్టి దేహమునిండ నత్తరులు పూసికొని తలకు సువాసనతైలము రాచికొని ఠీవితో బండినెక్కి బయలుదేరెను. నటేశమును నతడును గూడి కొంతసేపు క్లబ్బులో నాటలాడికొని యినుడస్తమించిన వెనుక వయ్యాలి కేగిరి. తిరువళక్కేణి ప్రక్కనున్న సముద్రముటొడ్దున నద్దమువలె స్వచ్చమగు బాటప్రక్కన మోటారునాపించి యందు విలాసలీల జానకి గూర్చుండియుండెను. ఆమె భర్తృవియోగము గల్గిన యీయైదేండ్లలో గొంచెముగా బలిసి వేషాంతరమందుంటచే నానవాలు పట్టజాలనిరీతిగ నుండెను. సహజసౌందర్యము గలదగుటచేతను, ప్రకృతమన వేశ్యవలె నలంకరించుకొన్న దగుటచేతను, బాటనేగు గోవాండ్లెల్ల నామెవంక విలాసముగా జూచుచు గారుకడకువచ్చి మాటాడ గుతూహలపడుచుండిరి. నౌకరు వచ్చినవారినెల్ల జీదరించి వెడలుగొట్టుచుడెను. కొంతసేపటికి మనచెట్టియారు సొదరులు వచ్చిరి. వారి వద్దపెట్టవలదని జానకి చోదకునితొ మెల్లగా బలికెను. వారికారు బాటకు రెండవప్రక్క నిలువబడను. నటేశము చిఱునవ్వుతో రామయ్యను వెంటబెట్టుకొని వచ్చి, "సుందరీ! నిన్ననేనుబ్రశంసించిన రామయ్య చెట్టి యీతడే.ఈతడొకకోటీశ్వరుడు, మహారాజుల కప్పుకావలయునేని చెన్నపురిలో నీతడే యీయవలెను. నీసౌందర్యము నీరూపపటమందు జూచి యతడు నిన్నువలచి నీచెట్టు బట్టవచ్చి యున్నవాడు" అని పలికెను.