పుట:Goopa danpatulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

129

పునస్సమాగమము.

లెవరైన మనల జూచి కినియవచ్చును. మన మానమునకు బాలుకావలసివచ్చును. వలదు, దాని యింటికి బోవలదు. అది ప్రతిసాయంకాలమున 'బీచ్ ' కి షికారువచ్చును. అచ్చట నొక్కతెయే యున్నవేళ, గానిపట్టి పట్టుకొనవలయును.

  రామ--అట్లయిన నేటిసాయంకాలమే పోవుదము. శుభశ్యశీఘ్రమ్మని పెద్దలందురు.
   నటే--నేడువలదు. రేపుపోవుదము. నేటికి నేనేగి నిన్నుగూర్చి యుపొద్ఘారముగా గొంతపల్కివత్తును. ఓకవేళ నదిదొరకి నీకు లోపడుననుకొనుము., అది సవతిపొరు సమ్మతించునా? అప్పుడు గంగాబాయి మాటయేమి?
     రామ--అప్పటికొలది జూచుకొందములే, గంగాబాయి స్వస్దపడునప్పటి కెట్టులైన నాఱునెలలు పట్టునుగదా? అందాక నామెకు దగినసొమ్మిచ్చి యొక్కడననోయుంచి యావేశ్యతో గంగాబాయిని వదలివేసినటులే తెలియజేయవచ్చును. ఆఱునెలలు దాటినపిమ్మటమాట యప్పుడే యాలోచించుకొన వచ్చును.
  నటే--సరే. అలాగునే చేయుదము. రేపుసాయంకాలమున మాయింటికి రమ్ము. అక్కడినుండి క్లబ్బునకేగి యచ్చటినుండి బీచ్ కి బోవుదము. నీవును లెస్సగా సింగారించుకొనుము.
   రామయ్య వల్లెయనెను. నటేశము గృహమున కరిగెను. మఱునాటి సాయంసమయమున రామయ్య విలువగల బట్టలు