పుట:Goopa danpatulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడనొకపేటలోనుండి మఱియొక పేటకు బోవుటకు నినుపదారులగుండబోవు బండ్లు "ట్రామ్సు" అన బడునవి గలవు. "మోటారుబస్సు"లకు లెక్కయేలేదు.

గంగ - అమ్మా! నేనాట్రాముబండ్లెప్పుడును జూడలేదు. అవికూడ రైలుబండ్లవలెనేయుండునా? వానిలోనుండి పొగవచ్చునా?

సుంద - అబ్బే! అవి రైలుబండ్లలాగున నావిరిచేనడుప బడవు. వానికి "ఎలక్‌ ట్రిసిటీ" యనబడు నొకదివ్యశక్తి యాధారమైయున్నది. ఆశక్తిచేతనే పట్టణమంతయు గాంతి వంతమగుదీపికలచే బ్రకాశించుచుండును. నగరములోని దీపములన్నియు నొక్కసారియే వెల్గింపబడునుజుమీ!

గంగ - సుందరమ్మగారూ! నేనాముచ్చటలన్నియు జూచి మఱి చనిపోవలెనని కోరుచున్నాను. నాకోరిక యీడేఱునోలేదో! విశాఘపట్టణములో గొప్పవారియిండ్ల బెండ్లిండ్లలో వెలిగింపబడుగ్యాసులైట్ల కన్న నచ్చటిదీపములెక్కువకాంతితో నుండునా? అక్కడి బజారు మిగుల బాగుగనుండునుకాబోలు!

సుంద - గంగమ్మా! చెన్నపట్టణము వెళ్ళుట యెంతపని! మీకొకనెలలోవచ్చునాదాయము వ్యయము చేసికొందురేని, మీదంపతులు ఆపురికి బోయిచూచిరావచ్చును. నీవు చూచిన గ్యాసులైట్లకాంతి యక్కడి యెలక్ట్రిక్ లైట్ల కాంతిలో నాల్గవవంతైన నుండదు. ఇకనచ్చటి బజారు మిక్కిలియానంద దాయకముగా నుండును. ఈ రాష్ట్రములోగల విన్నాణపువస్తువుల