పుట:Goopa danpatulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
110

గోపదంపతులు.

వును. ఆమె మేనునిండ రత్నాభరణములే! యామె కట్టుబట్టలన్నియు బంగారు జరీతొ నిండినవే!

 ఈరీతిగా గంగాబాయి యొక మహారాజ్ఞవలె ననంతైశ్వర్య మనుభవించు చుండుటచే దాను మొదట దైవసాక్షిగా బెండ్లియాడిన మగనిమాటగాని, కని పెంచి పెద్దదానినిగా జేసిన తల్లిమాటగాని యామె స్మృతికి రాకుండెను. భాగ్యదేవత నిముసములో నెట్టివారి కన్నులైనను గప్పివేయునుగదా!
   రామయ్యచెట్టితో గాపురము చేయుచుటకు మొదలిడిన యొకయేడాదికి గంగాబాయి కొక కూతురు పుట్టెను. గంగమ్మ గర్భవతియై యున్నప్పుడు రామయ్య యనేకవిధములైన మాడిగలామెకు గొని తెచ్చి యిచ్చుచుండెడివాడు. ఏడవమాసమున దమిళాంధ్ర దేశాచారములనుబట్టి చేయు సీమంతోత్సవ మత్యుత్సాహముతో జేయించినాడు  పురిటికి బ్రసిద్ధి వహించిన యాంగ్లేయ వైద్యురాండ్రను బిలిపించి చికిత్స జేయించినాడు.జాతకర్మాదికముల నత్యంత వైభవముతో నడిపించినాడు. బిడ్డకు ముద్దుముచ్చటల నెన్నివిధములనో తీర్పించినాడు. శిసురక్షణమునందు గ్రమశిక్షనొందిన దాదుల నెందరినో తనశిశువును బెంచుటకై నియమించి యున్నాడు. ఆబాలిక కొఱకు రకరకముల దుస్తులు, త్రోపుడుబండ్లు, అలంకారములు, ఆహారపదార్దములు  ఆటవస్తువులు మున్నగునవి తెప్పించినాడు. మూడవనెల ముద్దకుడుములనియు,