పుట:Goopa danpatulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

107

నూత్నజీవనము.

దిన మొకింతసేపు 'క్లబ్బు ' లోనికిబోయి యవల నొక్కడును సంద్రపుటొడ్డున గూరుచుండి యేదో తలపోయుచుండెను.

    ఒకనెల యైనతర్వాత మరల సర్కసు మొదలుపెట్టిరి. కాని సామిపిళ్లకు మునుపటిసొగసు లేదు. అతడు 'ఫీట్సు ' చేసినపుడు జనుల కరతాళద్వను లంతగాలేవు. అతనిని జూచి సర్కసునకు వచ్చువారు లెక్కకు దక్కువగా నుండిరి. సర్కసు వా రతనివైఖరిజూచి యించుక విసుగుకొన నారంభించిరి. అతనికిగూడ నాసేవ మిగుల భారముగా దోచుచుండెను.
    ఇట్లుండ స్టార్ సర్కసు కంపెనీవారు నిజాము రాష్ట్రమునకుబోయి కొన్నియాటలాడ దలచినట్లు సామిపిళ్ళకు దెలియవచ్చెను. స్ధలము మార్చుటచే గొంతకనశ్శాంతి గలుగునని సామిపిళ్ళ యూహించి మొదట సంతోషించెను. కాని మరల దీర్ఘముగా నాలొచింపగా దనప్రియురాలు తాను బరస్దలమున నున్న దొరకుట యసంభవమనియు, నిందేయున్న నేనాటికేని లభింపవచ్చుననియు నతడూహించి, తాను హైద్రబాదునకు బ్రయాణము కాజాలనని యజమానుల కెఱింగించెను. వారు రాకతప్పదని నిర్భంధపెట్టిరి. అప్పలసామి యెంతకును సమ్మతింతక. తుదకు వారితొ వాగ్వాదముగూడ గొంతనలిపి తనయుద్యోగమును వదలుకొనెను.
   తమిళులు కేవల స్వార్దపరులు. తమ కుపయోగించునంతవఱకే! చేతనాచేతనపదార్దముల పట్ల నాగాదరము జూపు