పుట:Goopa danpatulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెడును? నమ్మకముగా నిచ్చినప్పు డక్కడిపాలుసైతము నేనిచ్చు పాలరుచినే పొందియుండవలెను గదా?

సుంద - పాలరుచి యావులుతిను మేతనుబట్టికూడ నుండును గదా? ఇక్కడ మీగోవులకు మంచిపచ్చికమేత గలదు. చిట్టుపొట్టులు మీరు పెట్టునట్టులు వారు పెట్టరు. మీరు పశువుల కిడునాహారములోగల సత్తువ వారిచ్చు నాహారములో లేదు. అక్కడి యావులలో విశేషసంఖ్యలు ఆస్ట్రేలియా మున్నగు పరదేశములనుండి వచ్చునవే. అవికుంచముల కొలది క్షీరములనొసంగును. కాని యందు మన దేహమున కుపయోగించు వస్తుచయము చాలా తక్కువగానుండును.

గంగ - అమ్మా! ఆయావులకు మనయావులకు రూపములో భేదముండునా?

సుంద - రూపములోను భేదముగలదు. అర్పులలోను భేధముగలదు. అవి యిక్కడి గోవులవలె సంబారవములు చేయవు. కీచుకంఠములతో గోయనికూయును. వానిదేహము లిచ్చటివానికంటె నురుపులుగానుండును. వానిమొగములలో లక్ష్మీకళ తక్కువగా నుండును.

గంగ - అమ్మా! చెన్నపట్టణము చాలా పెద్దది కాబోలును?

సుంద - గంగమ్మా! పెద్దదని నెమ్మదిగానందువా? విశాఘపట్టణము చూచితివిగదా? దానికి బదంత లుండును.