పుట:Goopa danpatulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
100

గోపదంపతులు.

తనయవస్దను యజమానులకు నివేదించెను. "అయ్యలారా! పట్టణమున మెట్టిచట్టలం బట్టించునో చూచితిరా!" యని యతడనెను. తెల్లవాఱువఱకెవ్వరును గమ్మాయ కుండిరి. వెలుగు రాగానే యెవరియిండ్లకు వారేగిరి. శంభులింగము పిళ్ల యప్పలసామిని దీసికొని తనగృహమున కరిగెను.

12. నూత్నజీవనము

     రామయ్యచెట్టి గంగాబాయిని దీసికొని పల్లవరమునకు బోయెను. పల్లవరము చెన్నపురికి సమీపమందున్న నించుక యున్నతస్దలమున నుండి వినిర్మలమైనగాలితో నుండుటచేత క్షయాది రోగపీడితు లచ్చటికిబోయి వైద్యము ఛేయించుకొందురు. అదిగాక యందు దెల్లవారివి కొన్ని హైందవులవి కొన్ని సుందర మందిరములు గలవు. వానిలో మనరామయ్యచెట్టికి 'రతీవిలాస ' మబబడు సుందరమందిర మొందుగలదు. అపరమన్మధుడగు రామయ్యరతీదేవ్యవతారము లనదగు నవయువతీరత్నములతో గూడి యిందే కొన్ని దినములుండుచుండును. ఇప్పుడతనిపాలిట రెండవరతి యనబరిగిన మనకధానాయికతో నతడందే విడిసెను. 
   ఆభవనము సింగారింపుల్రోనని చెప్పదగును. దాని చుట్టును విశాలమగు సుందరారామము గలదు. అందు ముందుగా, గొన్ని పలురకములగు పూలమొక్కలు గలవు. కొన్ని