పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవలాకాల చరిత్ర

శ్రీ శ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచచరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనము అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తమమైన చరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.

ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలికప్రభువు, మహాసేనాధిపతి గోనగన్నారెడ్డి వర్ధమానపురం (నేటి వడ్డమాని) రాజధానిగా పశ్చిమాంధ్ర భూమి ఏలుతూఉండేవాడు. అతని కుమారుడు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదకావ్యం రచించి ప్రఖ్యాతి పొందాడు.

ఈనాడు ఆంధ్రదేశం అంతా నిండివున్న రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ మున్నూరుకాపు మొదలగు ఆంధ్రుల పూర్వీకులు దుర్జయకులజులు న.. ఆంధ్రక్షత్రియజాతికి చెందిన గోన గన్నారెడ్డి మహావీరుడు.