పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

గోన గన్నా రెడ్డి

ఒకరివైపు ఒకరు ఒకనిమేషం పారజూచి పక్కున నవ్వుకొన్నారు.

ఇరువురూ కలసి నెమ్మదిగా యువరాజు నగరిలోకి వెళ్లుచుండగా, సేవకులు, లేఖకులు, దౌవారికులు, కంచుకులు, అంగరక్షకులు వంగి నమస్కరించుచుండిరి. సభామందిరాలు గడచి ఆలోచనామందిరములోకి ఒక దౌవారికుడు దారిచూపుచుండ పోయి అందు సుఖాసనాల ఆసీనులయ్యారు.

శివ : ప్రభూ! కళింగుడు సింహాద్రికడ దండువిడిసి, రాణ్మహేంద్రవరం వరకూయుద్ధయాత్ర సాగించి కోనసీమమండల ప్రభువులు హైహయులనోడించి, గోదావరిదాటి నిడుదప్రోలుపై పడనున్నాడని మీకు తెలిసిన వేగునమ్మకమైనదేనా ?

వీర : గురుదేవా! ఆ వేగు నడిపింది మా నాయనగారి అంతరంగిక సేనాపతి, సోమనాథదేవులు. ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు చాణక్యదేవునకు గురువు కాదగిన ప్రతిభాశాలి!

శివ : కాళింగుని ఈ ఉన్మదానికి కారణం?

వీర : మన రాజ్యంలో ఉన్న కొందరు పెద్దలట!

శివ : ఎవరు వారు?

9

యువరాజు లోనికివచ్చి దేశికులకు నమస్కరించి, వీరభద్రుని నమస్కార మందుకొని పీఠముపై నాసీను డయ్యెను.

యువరాజు చూపులో, మాటలలో, నడవడిలో తొందరపాటుగాని త్రపాభావంగాని ఇసుమంతైనా గోచరించుటలేదు.

రుద్ర : కాబట్టి బాబయ్యగా రేమంటారు? వెంటనే కటకంపైకి ఎవర్ని పంపాలని?

శివ : ఇందులూరి పెదగన్నణమంత్రిని లక్ష కాల్బలంతో ఇందుశేఖరమహారాజుకు సహాయంగా పంపించవలసి ఉంటుంది.

వీర : ప్రభూ! నేను అయిదువందల ఏనుగులతో, రెండువేల ఆశ్వికులతో వారికి బాసట అవుతాను.

రుద్ర : చాళుక్యప్రభూ! మీరు ఇక్కడే ఉండండి. ఈ దేశం మీదికి శౌణయాదవులు ఏక్షణంలోనైనా విరుచుకుపడవచ్చును. అందుకనినేను ఒకవిధానం ఆలోచించాను. గాండ్లనగర ప్రభువు, రేచర్ల గణనాథుల చెంత ఏబదివేల విలుకాండ్రు ఉన్నారు. ఆయన మౌద్గల్యాతీరాన్నుంచి ససైన్యంగా బయలుదేరి గోదావరినది దాటి ఈశాన్యంగా సింహాద్రి పోయి అక్కడ కళింగప్రభువైన అనంగ భీమదేవుని తలపడగా, వేంగీవిషయాధినాథుడు కాలపనాయకులవారు ఇందులూరి పెదగన్నణామాత్యప్రభువును కలిసి గోదావరి ఉత్తరంగాపోయి ఇటువైపునుండి