పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

గోన గన్నా రెడ్డి

ఆమె మోము, అరుణరాగాలతో నిండి ఉదయించే చంద్రబింబంలా ఉన్నది.

ఆమె మోము, ఆనందవీచికారాశిలా ఉన్నది.

ఆమె, ఒక్కసారి విరిసిన కలువల గుచ్ఛంలా ఉన్నది.

ఆమె ఆనందం ఆ వార్త తెచ్చిన రాకుమారి కనిపెట్టి ‘వదినా! నీ కెంత సంతోషము’ అన్నది.

ఇంతలో చక్రవర్తి నగర ముఖద్వారం దాటారని వార్త. ఇంతలో వివిధ మంగళవాద్య మేళ గీతాల తీయదనాలు పన్నీరు జల్లుచుండగా నగర ప్రాంగణంలో రథము ఆగింది.

అన్నాంబిక మందమలయానిలంవలె చక్రవర్తి రథంకడకు పరువెత్తింది.

భర్తను వారి విడిదికడ దింపివచ్చిన చక్రవర్తి, రథంనుండి వేగాన ఉరికి అన్నాంబికను గాఢమైన కౌగిలింతలో అదిమికొన్నది.

7

ప్రేమాంభోధి

రుద్రమదేవి పీఠం అధివసించగానే గోన గన్నారెడ్డిని చూచి ‘మహారాజా! ఈ బాలుణ్ణి మీరు ఎరుగుదురటకాదా?’ అని ప్రశ్నించెను.

గోన: మహాప్రభూ! యువకప్రభువును ఎరుగుదును. వీరు నాకు అంగరక్షకులుగా ఉండిరి.

రుద్ర: ఈ బాలుడు మీ సేవచేయడమే తనకు తారకమనిన్నీ, అందుకు మేము మిమ్ము ఒప్పించాలనీ చాలా ప్రాధేయపడినాడు. మాకు ఈ బాలునియందు చాలా కరుణ కలిగింది కాబట్టి మీకు వెంటనే వార్త పంపినాము.

గోన: చి.....చిత్తము మహా ప్రభూ!

రుద్ర: చక్రవర్తులమైన మాకు సేవచేయక ఇంకొకరికి సేవచేయాలనే పట్టు ఎందుకయ్యా. అని నేను చాలా కోపగించాను. కాని తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని తగవులాడుతున్నాడు.

గోన: మహారాజా! తమరు సెలవిచ్చినట్టే నేను ఈ రాజకుమారునికు చెబుతున్నాను.

రుద్ర: కాని మన ఆలోచన లీయనకు రుచించుటలేదు. ఈ బాలుడు మీ కొలువు చేయడానికి ఈయన తండ్రిగారు శ్రీ కోటారెడ్డి మహారాజు