పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయధ్యానం

289

ప్రళయతాండవం చేసే రాక్షసత్వాన్ని ప్రేమామృతంతో నాశనం చేయగలడా ఆ మహాపురుషుడు!

చాళుక్య వీరభద్రుని తాను చూచినక్షణమే అతడు తన జీవితానికి జన్మ జన్మలకు ఈశ్వరు డెట్లాఅయినాడు? ఏమి విచిత్రమైనదీ ప్రేమ? ఎంత తీయని బాధతో బ్రదుకుస్వరము నిండిపోతుంది? ఆత్మ ఒక్కటే అగుగాక, ప్రత్యగాత్మత్వము పొందిన ఒక్కొక్క వ్యక్తి ప్రపంచానుభూతులను ఒక్కొక్క విధంగా పొందగలుగును.

అన్నాంబిక గన్నారెడ్డికై పొందిన ప్రేమపరమార్థము, చాళుక్య వీరభద్రునికై తాను పొందిన ప్రేమపరమార్థము ఒకటే అయినా వివిధ మూర్తులుగా ఉంటవి.

వీరభద్ర ప్రభువునకు ఆపదలేమియు రాకూడదని తన హృదయములో ఉన్నది. అయినా క్షత్రియవీరుడు ప్రాణాలకుతెగించి యుద్ధము చేయవలసేఉన్నది.

వీరభద్రుడు పరమస్వామిగానూ, పరమశివుడుగానూ తనకు కనబడుతాడు. ఆయన వీరవిక్రముడై, పురుషోత్తముడు కావాలనీ తాను కోరుతుంది. యుద్ధములో అనవసరపు హానికి లోబడకుండా, ఆయన తమ నగరులోనే ఉండాలని తాను కోరుతుంది.

ఓహో ప్రేమ అత్యద్భుతము! ప్రేమయే ఒక వ్యక్తి! ప్రేమే సర్వ సృష్టికీ మూలము.

“చాళుక్యప్రభూ! మీరేమి ఆలోచించుచున్నారు?”

రుద్రదేవి తన నగరులో దేహము వేడెక్కగా, ఏవో మాధుర్యాలు తన్ను పొదువుకొనగా, వక్షము లుప్పొంగగా సిగ్గుపడుతూ తన మంచముపై వాలి పోయినది.

2

మహాదేవరాజు కాకతీయ మహానగరం ముట్టడించిన పదునాలుగవ నాటి ఉదయము మొదటిజామునుండి రుద్రదేవి సమస్తసైన్యాలతో కోటవిడిచి మహాదేవరాజు సైన్యాలపై ఉరికినది. అన్ని గోపురద్వారాలు, దిడ్డిదారులు తెరువబడినవి. కోటగోడలమీదనుండి నిరంతర బాణవర్షము శత్రువులపై కురిపిస్తున్నాడు. చాళుక్య వీరభద్రమహారాజు.

ఇన్నాళ్ళనుండీ మహాదేవరాజు బలగాలు మట్టిగోడను బద్దలుకొట్టడానికి చేసిన ప్రయత్నానన్నీ ఏనుగుపై కురిసినవానలా అయినవి. అక్కడక్కడ కొన్ని