పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవులు

261

సింగ: లేకపోతే సాధారణ గజదొంగతనం ఒకటీ చేయకుండా, రుద్రమ్మపై తిరగబడిన సామంతుణ్ణల్లా పట్టి హతమారుస్తాడా?

భవా: వీడు మన జైత్రయాత్రకు అడ్డం అనికాదు. కాని నేనుపెట్టిన ముహూర్తానికి ఓరుగల్లుకోట ముట్టడించలేకపోయాము.

జైతుగి (అశ్విక సైన్యాధ్యక్షుడు): రేపు మనం మంజీర ఎలాగు దాటడం?

సింగ: నిర్మలనుండి మల్యాల చౌండయ్య సైన్యాలతో అడ్డుపడేట్టు ఉన్నాడు.

మహా: సింగదేవప్రభూ! మన రెండులక్షల సైన్యాన్ని వెనక్కు రమ్మనండి. ఆ సైన్యం ఏభైవేల నావలమీద మంజీర గోదావరీ సంగమం దగ్గర కాకుండా దక్షిణంగా గిరికోటదగ్గర దాట ఆజ్ఞ ఇవ్వండి. ఆ దాటింపవలసిన బాధ్యత జై తుగిదేవ ప్రభువుది.

భవా: ఆ సైన్యాన్ని దాటనీయకుండా గన్నారెడ్డి ఒక ప్రక్కనుంచీ మల్యాల చౌండయ్య గోదావరి ఆవలిప్రక్కనుంచీ తాకవచ్చునుకాదా చక్రవర్తీ?

మహా: అవన్నీ ఆలోచించాము భట్టోజీ! దాటే సైన్యాన్ని మేము మొదట తెలియజేసిన కోటల విధానంతో తాత్కాలికపు కంపకోటలు ఏర్పాటు చేసుకొని శత్రువు వెనుకనుంచి మీదబడకుండా చూచుకొనండి.

జైతు: చిత్తం మహారాజా!

మహా: తక్కిన ఏభైవేల నావలలో మేము సంగమానికి ఎగువ బోధన గిరికడ దాటగలము.

సింగ: ఈలోగా మనదేశంనుండి ఆహారపదార్థాలను తీసుకొనివచ్చేటందుకు వెళ్ళిన రెండులక్షల సైన్యం వచ్చి కలుసుకుంటుంది.

మహా: మంజీర దాటగానే మన సైన్యాలను ఆరు సైన్యాలుగా విభజిస్తాను. ఒక్కొక్క సైన్యం అయిదారు గవ్యూతుల దూరంలో యాత్ర సాగించాలి. శత్రువు ఎదురుబడితే లెక్కచేయక ముందుకు సాగిపోయి శత్రువును చుట్టుముట్టి నాశనం చేయాలి.

శంకరదేవ (గజసైన్యాధ్యక్షు) : శత్రువుల సైన్యాలు తక్కువగా ఉన్నాయి అని కదా మనకు వేగువచ్చింది. ఆంధ్రాసామంతులు కొందరైనా మన వైపు చేరక పోయినా ఆ రుద్రమ్మకు సాయంవెళ్ళరు. అంతవరకు లాభం మహారాజా!

2

మంజీరానది దాటడం బ్రహ్మప్రళయమే అయినది యాదవునికి. లక్షల బలంతో నేర్పుతో మంజీరానదినిదాటి, కాకతీయుల నెగ్గినంత సంతోషము