పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

గోన గన్నా రెడ్డి

యుద్ధంచేస్తూ మూడు సంవత్సరాలు ఉండినారు. మహాదేవ చక్రవర్తిపై చోళుల ప్రేరేపణవల్ల అనేకమంది సామంతులు తిరగబడినారు. ఆ యుద్ధాలలో మహాదేవరాజు వీరస్వర్గ మలంకరించారు. ఇంతలో శ్రీ రుద్రదేవ చక్రవర్తి శౌణరాజును ఓడించి తిరిగి అనుమకొండవచ్చి, సింహాసనం ఆక్రమించి చోళులతో యుద్ధం చేస్తూ మరణం పొందారు. చోళులవల్ల కారాగారంలో పెట్టబడిన శ్రీ శ్రీ గణపతిదేవ చక్రవర్తిని విడిపించి శ్రీ రేచెర్ల రుద్రప్రభువు అనేక సామంతులతోకూడి చోళుల ఓడించి బాలు లైన మన సప్తమ చక్రవర్తిని సింహాసనంమీద కూర్చుండబెట్టినారు.

“ఈలా మనకు చోళులు ఎన్నోసారులు అవమానం చేశారు. ఇదంతా ఆలోచించి శ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులు శౌణయాదవులను నాశనంచేసి ఈ మహదాంధ్రదేశం యావత్తూ తమ ఏకచ్ఛత్రం క్రిందకు తీసుకువచ్చి చల్లనిపరిపాలనము నెలకొల్పారు. కాని చోళుల రాజ్యకాంక్షపోలేదు. దక్షిణాన పాండ్యులు విజృంభించి చోళరాజ్యం ఆక్రమిస్తూ ఉండడంవల్ల చోళులు మన రాజ్యంమీదకు రావడం ప్రారంభించారు. తెలుగుచోడులందరు ఇదివరకు చక్రవర్తికి దాసోహమ్మని సామంతులయ్యారు. ఇంక మిగిలింది కాంచీ మహాపుర రాజ్యం. కాంచీపురంలో అదివరకు చాళుక్య మహారాజైన కులోత్తుంగుని వంశమువారు కాంచీపురం రాజధానిగా ఆంధ్రదేశానికి చక్రవర్తులుగా ఉండేవారు.

“అలా ఉంటూఉంటే పాండ్యులు విజృంభించి కాంచీపురంమీదకు దండెత్తి వచ్చారు. తెలుగుచోడులు మన సప్తమ చక్రవరి సహాయం అపేక్షించారు. వారు వెళ్ళి పాండ్యులను ఓడించి, తరిమి, కాంచీపుర చోడులను తనకు సామంతులను చేసుకొని, అరవ చోడదేశంపై దండెత్తిపోయి ఇన్నాళ్ళనుంచీ వారు తమ దేశానికి చేసిన అపకారాలన్నిటికీ బుద్ధి వచ్చేటట్లు చావగొట్టారు. కంచిలో తమ పక్షాన సామంతభోజునీ, సింద మార్జవాడులలో తమ పక్షాన గంగయ సాహిణి మహారాజును ఉంచారు.

“వీరనాయకులు మీరందరూ ఇప్పుడే జాగ్రత్తగా వినండి. తెలుగు చోడ సామంతులు తమలో తాము కలహాలలోపడి చక్రవర్తి గారి సహాయం కోరేబదులు దక్షిణాన పాండ్యులను, చోడులనూ సహాయం కోరినారు. అప్పుడు దక్షిణాంధ్ర మంతా అల్లకల్లోలం బయలుదేరింది. అప్పుడు మన సప్తమ చక్రవర్తులు విజయగండ గోపాలునికి, గంగయసాహిణికి సైన్యాలు పంపి సహాయం చేసి, అటు పాండ్యుల్ని, ఇటు దక్షిణ చోళులనుకూడా ముక్కలు చేశారు.

“పాండ్యులకు బుద్దివచ్చి దక్షిణానికి మధుర వెళ్ళిపోయారు. కాని దక్షిణచోళుడైన రాజేంద్రచోళుడు తనఆశ వదలక రెండేళ్ళక్రితంవచ్చి త్రిపు