పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

227

లందరూలేచి నిలుచుండి ‘జయ జయ! గోనవంశకలశాంబుధిరాకాచంద్రా!’ అన్నారు. వందిమాగధులు ‘సమస్తగుణగణాకర జయ జయ! సత్యజ రత్నాకర, జయ! సౌజన్యగంభీర, జయ! అరిగండభైరవ, జయ! సాహసోత్తుంగ జయ! వీరవితరణోత్సాహ, జయ! కడుపులూరిపురాధీశ్వర, జయ! వీరలక్ష్మి నిజేశ్వర, జయ! మనుమకులమార్తాండ, జయ! మీసరగండ, జయ! కామినీజయంత, జయ! కోసగి మైలి తలగొండుగండ, జయ! ఉప్పలసోముని తలగొండుగండ, జయ! వందిభూపాలుని తలగొండుగండ, జయ! అక్కినాయకుని తలగొండుగండ, జయ! మేడిపల్లి కాచనాయ కురిశిరమండ, జయ! కందూరి కేశి నాయకుని తలగొండుగండ, జయ! తెఱాల కాటయశాపట్ట, జయ! బేడచెలుకినాయని నిస్సాణాపహరణ, జయ! సహజ శౌర్యాభరణ, జయ! కోట పేర్మాడిరాయ కంఠాభరణ చూరకార, జయ! చోడోదయ పట్టసూత్రతురంగాపహార, జయ! జయ!, అని దిక్కులు మారుమ్రోగ పలికినారు.

అ బాలుని చేయి పట్టుకొని గోన గన్నారెడ్డి సింహాసనమెక్కి ఆ బాలుని తనప్రక్క కూరుచుండబెట్టుకున్నాడు.

10

ఆ బాలకుని తనప్రక్క అర్ధసింహాసనమిచ్చి గౌరవించుట గన్నారెడ్డికే ఆశ్చర్యంవేసింది. తమ నాయకుడు కారణం లేక ఏపనీ చేయడని తక్కిన వీర ప్రభువులందరు అనుకొన్నారు.

ఆ నిండు సభలో గోన గన్నారెడ్డి అక్కినప్రగడ లేకపోవడంవల్ల చెప్పవలసిన విషయము సబ్బప్రభువే చెప్పవలెనని ఆయనవైపు చూచి తల ఊపినాడు. వెంటనే సబ్బనాయకుడు లేచి సింహాసనంముందు వచ్చి నిలుచుండి, ‘ఆంధ్ర క్షత్రియోత్తములైన మీ కందరకూ మన సేనాపతి, నాయకులు అయిన గోన గన్నారెడ్డి ప్రభువు పక్షాన జయము పలుకుతున్నాను. మీలో యువక ప్రభువులు, యువ రాజులు, రాజకుమారులు ఉన్నారు. గన్నారెడ్డి ప్రభువుతోపాటు ఏలాంటి వీరవిక్రమకార్యాలకన్నా వెనుదీయకుండా అనేక విజయాలు సముపార్జించారు. ఇప్పుడు మనకు తెలిసిన వేగువల్ల చోళమహారాజుకు శ్రీ ఆంధ్రదేశం పై కన్నెత్తి చూచేటంత సాహసం వచ్చింది. వినండి. పూర్వకాలంలో మన రుద్రచక్రవర్తి పెదతాతగారు శ్రీశ్రీ రుద్రదేవ చక్రవర్తి రాజ్యంచేస్తూ ఉండిరి. వారు శౌణరాజైన జైత్రపాల యాదవునితో యుద్ధానికి వెడుతూ శ్రీ రుద్రచక్రవర్తి తాతగారైన శ్రీ మహాదేవ రాజును చక్రవర్తిగా నిలిపి తాము వెళ్ళినారు. ఆ సమయంలో చోళులు కృష్ణాతీరం వరకువచ్చి, వారిరాజ్యం అల్లకల్లోలం చేశారు. రుద్రచక్రవర్తి శౌణరాజుతో