పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

217

సైనికుల్ని పొమ్మనండి. కల్యాణి తాము ఆక్రమించి చోడోదయ ప్రభువునే రాజ్యం చేయనియ్యండి. ఆయనధనాగారంలో ఉన్న ధనం మనధనాగారంచేర్పించి; అందులో సగం ఈ నాడులోని ప్రజలకు పంచండి.

గోన గన్నారెడ్డి సింహాసనమీదనుంచి లేచినాడు.

“జయ! చోడోదయ పట్టసూత్రతురంగాపహరణా! జయ! జయ! అని భటులు జయధ్వానాలు చేసినారు.

గన్నారెడ్డి మహావేగంతో చోడోదయుని అశ్వసూత్రంచే అలంకరింపబడిన తన అశ్వము అధివసించి, అక్కినప్రగడకూడా రాగా స్కంధావారం దాటి ఎక్కడి కేని పోవసాగినాడు.

వా రట్లు ఒక గవ్యూతిదూరం పోగానే గోన గన్నారెడ్డి అశ్వవేగం తగ్గించి ‘అక్కిన బావగారూ, ఇకపదండి, ఇంత ఆలస్యమైన తమ పునస్సంధాన మహోత్సవానికి, మీ తాతగారి మనస్సు తిరిగినదే చివరకు! మన రహస్యం తెలిసి తిరిగిందా, లేక ఆర్ద్రత తాల్చిందా?’ అన్నాడు.

“బావగారూ! ఆయన మనస్సే కరిగిందనుకొంటాను. మా బామ్మగారు కంటినీటితో, మాతాతగార్ని చూచి, ‘మీరు బ్రాహ్మణు లనుకొన్నాను. పై స్వరూపం చూచి మోసపోవడం ఉంటుంది. కొన్ని మేఘాలు బాగావర్షిస్తాయి, అనుకుంటాము. అవి వృధాడంబర జీమూతాలని తెలియడం కష్టం’ అన్నదట. ఆ రాత్రి మా తాతగారు భోజనం చేయలేదట. ఆ మరునాడు నిరశనవ్రతమేనట. ఆ మూడవనాడు, వారితో పాటు నిరశనవ్రతం చేసే మా బామ్మదగ్గరకు మా తాతగారు వెళ్ళి ‘అక్కిన ప్రస్తుతానికి మనం అందరం వెడుతున్నాము’ అన్నారట.”

6

గోన గన్నారెడ్డి, అక్కినప్రగడ మొదలయినవారు అంతా, అక్కినప్రగడ అత్తవారి ఊరు ప్రోలేశ్వరము చేరిరి.

ఓరుగల్లునుంచి పెద్ద అక్కినప్రగడ, సోమయామాత్యులు, చుట్టాలు పక్కాలు అందరూ వేయిమంది మెరికలవంటి ఆంధ్రసైనికులతో వచ్చిరి.

వారికందరికీ చెన్నాప్రెగడ మాచయమంత్రి తగిన విడుదులు ఏర్పాటుచేసి ఉంచినాడు. ఊరంతా పచ్చని తోరణాలతో, పందిళ్ళతో, అలంకారాలతో నిండి పోయింది. ఇరువంకలా చుట్టాలు వందలు వందలు వచ్చారు. ముఖ్యంగా ఆడవారు ఎక్కువమంది ఈ శుభకార్యానికి చేరారు. ఈ శుభకార్యం ఆడవాళ్ళకు పండుగ. ఆంధ్రులీ ఉత్సవంలోనూ, పెళ్ళినాడూ పొందే ఆనందం ఇంతా అంతా కాదు. వారి వేళాకోళాలు, వేడుకలు; విందుభోజనాలు దేవతలకుకూడ ఒడళ్ళు మర