పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

గోన గన్నా రెడ్డి

గపు మెడలో చోడోదయుడు వజ్రాలుపొదిగిన బంగారు తాడుతో ఆణిముత్యాల హారం అలంకరించాడట.

ఆ ఉత్తమాజానేయ మధివసించి చోడోదయుడు వర్థమానపురం ముట్టడిని సాగిస్తున్నాడు.

అతని హృదయంలో ఈ వర్థమానపురాన్ని పట్టుకోవడం అయిదు నిమేషాలని. ఈ పురం ప్రస్తుతం పాలించేది ఒక బాలకుడుకదా? రాజు కావలసిన గన్నారెడ్డి గజదొంగ అయినాడు. ముసలిరాజు బందీ. వర్థమానపురం దొరకగానే ఓరుగల్లు కొద్దివారాలలో తన హస్తగతం. చోడచక్రవర్తులు, చాళుక్య చక్రవర్తులు ఆతన్ని ఆశీర్వదిస్తున్నారని ఆతడు భావించి ‘ఎవ రీ కాకతీయులు?’ అనుకున్నాడు.

ఆ వెంటనే రోజుకుంటూ అశ్వానెక్కిన ఒక చారుడు చోడోదయ మహారాజుకడకు పరుగిడివచ్చి ‘జయ! శ్రీ మహారాజాధిరాజునకు జయ! గోన గన్నారెడ్డి సైన్యాలతో మహాప్రభువుమీదకు వస్తున్నాడు!’ అనివార్త తెచ్చాడు.

“ఏమిటీ, గన్నారెడ్డా! ఆ గజదొంగా? ఎందుకు వస్తున్నాడు? ప్రాణాల మీద ఆశపోయిందా? లేక తనకు దక్కని వర్థమానపురం మావలన దక్కుతుందనా? మాతోచేరి, మాకు దాసుడైతే ఈ నగరాన ఈ దొంగను సామంతుణ్ణి చేద్దాము” అని చోడోదయ మహారాజాధిరాజు తన్ను కొలిచిఉన్న సేనాధికారులతో అన్నాడు.

ఆ ముక్కలు ఆత డంటున్నాడు. మరుసటిక్షణంలో తృణావర్తుడులా గోన గన్నయ్య ససైన్యంగా వచ్చి చోడోదయుని సైన్యాలపై విరుచుకు పడినాడు.

ఎంత సిద్ధంగాఉన్నా ఆ ఢాకకు చోడోదయుని సైన్యాలు ఉప్పెన కెరటానికి విరిగిన తాళవనంలా అయిపోయినాయి.

5

ఎప్పుడు గోన గన్నారెడ్డి సైన్యాలువచ్చి తన సైన్యాలను తలపడినా యని విన్నాడో, ఆ వెంటనే తన ఆశ్వికసైన్యాలు గన్నారెడ్డి సైన్యాలను చుట్టుముట్టవలసిందని ఆజ్ఞఇచ్చి, ఆ సైన్యాలను తానే స్వయంగా నడుపుకుంటూపోయి కల్యాణి చోడోదయుడు గన్నారెడ్డిసైన్యాలను ఆరుగవ్యూతులదూరంలో మధ్యను తాకినాడు. ఆవెంటనే గన్నారెడ్డి సైన్యాలు ఇటుతిరిగి భల్లూకవ్యూహం రచించాయి. ఆసంకుల సమరంలో చోడోదయుని ఎడమవైపునుంచి గన్నారెడ్డి తానున్నూ తెల్లని అజానేయంపై అధివసించి, తన ఆశ్విక సైన్యాలను నడుపుకొని వచ్చి మధ్యనే తాకినాడు.