పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

205

కాబోలు! మేము నీ కనుసన్నల మెలిగే హీనమానవులం! తల్లీ, పరమపావనీ!

“కాకతీయ వంశోద్భవకారిణీం
 లోకోద్ధరణ స్వరూపిణీం
 కృపామయీం కలుషహారిణీం
 శక్తిమయీం రిపువిదారిణీం
 నమామి, శర్వాణీం ముక్తిదాయినీం”

అని ప్రార్థిస్తూ కన్నులు మూసినాడు. అతని హృదయంలో సింహవాహనా రూఢయై కోటిసూర్యప్రభాసితయైన ఒక నిర్మల తేజోమూర్తి చిరునవ్వుతో ప్రత్యక్షమైనది. హృదయంలోనుండి వేయి బరువులు పటాపంచలుకాగా ఆ ఉత్తమ చాళుక్యుడు లేచి, దేవీప్రసాదము కన్నుల కద్దుకొని ఆరగించి దేవాలయం వెడలి రథము ఆరోహించి తన నగరు చేరినాడు.