పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

195

సింహాసనం ఆక్రమించక పూర్వం గోన గన్నయ్యను సమీపించి ఆ గజదొంగను కౌగిలించి చేయిపట్టుకొని తమతోపాటు అర్ధసింహాసనాన్ని అధివసింపచేసుకొన్నాడు.

మహారాజు: గన్నారెడ్డిప్రభూ! మాకు బంధువుగా ఈ పేర్మాడిరాయుడు, స్నేహితుడుగా ఈ కాటయనాయకుడూ మా రాజ్యం చొచ్చి, మా నగరం ప్రవేశించి, మా కోటకు అతిథులై దొంగపాటున మేమంతా నిదురపోతున్న సమయంలో మమ్ము బందీచేశారు. మీరు సమయానికి రాకపోతే ఈ కుత్సితులు మా ప్రాణాలే హరించి ఉందురు.

గన్నారెడ్డి: మహారాజాధిరాజా! ఇందులో నా గొప్ప ఏమీలేదు. మేము కోట ముట్టడించగానే, కోటలోఉన్న తమ సైన్యం అంతా తిరగబడి దొరికిన ఆయుధాలతో, ఈ దుర్మార్గుల సైన్యాలకడ లాగుకొన్న ఆయుధాలతో యుద్ధంచేయ ప్రారంభించారు. ఈ రెండు అగ్నులమధ్య నాశనంకాలేక వీళ్ళు నాకు లోబడినారు. మేము రాకపోయినా మహాప్రభువులు ఈ పిశాచులను నాశనం చేసేవారే.

మహారాజు: ఏమి పేర్మాడిరాయా! నీకు తగిన శిక్ష ఏది ?

పేర్మాడి: మహాప్రభువుల అనుగ్రహం. బంధుద్రోహం చేసిన నాకు మరణమే శిక్ష!

కాటయ: మహాప్రభూ! నేను శిక్షింపడానికికూడా తగను.

ఇంతలో దౌవారికుడొకడు ప్రవేశించి మహారాజు సింహాసనం ఎదుట మోకరించి ‘మహారాజాధిరాజా! మహారాణీవారు వీరిద్దరినీ శిక్షించేపని శ్రీశ్రీ గోన గన్నారెడ్డి ప్రభువులకు వదలవలసిందని మహారాజులంవారికి మనవిచేస్తున్నారు’ అని మనవిచేశాడు.

మహారాజు: మా ఉద్దేశమే మహారాణిగారికీ కలిగింది. చాలా సంతోషము. శ్రీ గన్నయ్య మహారాజా! మా ప్రేమా, మా కృతజ్ఞతా తమకు ఏలాగు తెలియ జేయగలం? తాము మా ప్రార్ధనా, మహారాణీగారి ప్రార్ధనా అంగీకరించి తమ రాజ్యం తాము స్వీకరించండి. మే మిరువురమూ చక్రవర్తులతో, రుద్రదేవ మహారాజులతో మనవిచేస్తాము.

గోన: మహాప్రభూ! నావిధి నేను నిర్వర్తించాను. ఈ బందీల విషయంలో శ్రీ గణపాంబా మహారాజ్ఞివారి భావమే ఉత్తమమైనది. ఇదివరదాకా ఈ ప్రభువు లిద్దరూ తమకు భక్తిగల సామంతులు. ఈనాడు ఏదో చెడుబుద్ధి పుట్టి ఈలా అయ్యారు. అదుగో! మా మంత్రి అక్కినప్రగడ కృష్ణదాటి వచ్చాడు.

అప్పుడు చినఅక్కినప్రగడ సభలోనికి ప్రవేశించి ‘మహారాజాధిరాజా! జయము! జయము! నేను రాకుండా యుద్ధం పూర్తి అయినందుకు విచారముగా ఉన్నది. కాని మహాప్రభువులకు, మహారాణీవారికీ ఇంతయినా ఆపత్తు కలుగ