పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

గోన గన్నా రెడ్డి

“బావా! నా పాటకేమిగాని, అక్క సంగీతం వినాలి నువ్వు!” అని ముగించింది.

“ఈ సాయంకాలం మీ అక్కను పాడమను సీతా! నీ పాట అద్భుతము! నీ కేమి బహుమానం ఈయగలను? ఇదిగో ఈ చిటికెనవ్రేలి ఉంగరం నీకు అర్పిస్తున్నాను.”

“నాకిస్తావేమి ఉంగరం, అక్కడ ఇవ్వాలిగాని”

“ఆ గొడవ నీ కెందుకు? నీకు ఉంగరం, చిన్నమరదలు కల్యాణికి నేను పట్టుకువచ్చిన బంగారు ఏనుగ బహుమానం” అని అవి తన గుండ్రని తోలుపెట్టెలోనుంచి తీసి ఆ విగ్రహం కల్యాణికి ఇస్తూ’ సీతవేలికి ఉంగరం తొడిగాడు. మధ్యవేలికికూడా ఆ ఉంగరం కొంచెం వదులయింది.

“బావా! ఈ ఉంగరం వదులైనా, ముద్దులు మూటగట్టుతూంది. ఏదారమో చుట్టు నా వేలినుండి ఎప్పుడూ పోనివ్వను” అని సీత కంటినీటితో అస్పష్ట వాక్యాలు పలికింది.

అక్కిన మరదలు కంటినీటికి ఆశ్చర్యమంది, ‘సీతా! అదేమిటమ్మా అలా బెంబేలుపడతావు. ఒక్కటిమాత్రం నీకు మాటఇస్తాను. ధర్మదేవత సాక్షిగా మేము ఏవిధమైన పాపము చేయటంలేదని నీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. రెండవది, నీకు, కల్యాణికి, మీ అక్కకు నే నిచ్చిన బహుమతులలో ఏ అసత్యార్జనా లేదు. అవి ధర్మవిరుద్దం కాకుండా నాకు బహుమానాలుగా వచ్చాయి. నేను గజదొంగను కాకమునుపే, నా పాండిత్య దిగ్విజయయాత్రలో వచ్చినవి’ అని పలికినాడు.

కంటినీటితో నవ్వుతూ సీత ‘బావా! అందుకుకాదు నాకు కన్నీరు వచ్చింది. మా కెవ్వరికీ నీమీద అనుమానం లేదు. అధర్మమైన పని ఏదీ నువ్వు చెయ్యవని మాకందరికీ నమ్మకమే బావా! కాని నువ్వు మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తావా అని తలచుకొంటే కన్నీళ్ళు తిరిగాయి. అక్క నీ పేరే మంత్రంగా, నీ చిత్రాన్ని పూజింపని దినం లేనేలేదు. అక్క సాక్షాత్తు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీనీ! అక్క ఇంకెన్నాళ్లు నిన్నువదలి ఉండగలదు? నీ కష్టాలలో పాలు పంచుకోవడానికి నీతో వచ్చి వేస్తానంది అక్క!’

అక్కినప్రగడ ఆనందంతో ఉప్పొంగాడు. ఆశ్చర్యంతో మ్రాన్పడినాడు. ‘సీతా! ముహూర్త నిశ్చయం పెద్దలచే చేయించే వచ్చాను. మా నగరంలో అందరూ కుటుంబాలు తెచ్చుకున్నారు. ఆలాగే మీ అక్క నాతో తప్పక వస్తుందని, మీ అక్కతో చెప్పు’ అన్నాడు.

8

ఆ మరునాడు గోన గన్నారెడ్డి ఉత్తమాశ్వం ఒక దానిని అధివసించి, ఏబదిమంది వీరులు తన వెంటరా మెరుము వేగాన ప్రోలేశ్వరము వచ్చి, దశ